News January 1, 2026
చిత్తూరు: స్వచ్ఛ రథం కోసం దరఖాస్తులు

చిత్తూరు జిల్లాలో స్వచ్ఛరథం ఆపరేటర్లకు ప్రభుత్వం నెలకు రూ.25వేలు ఇస్తుంది. అతను ఇంటింటికీ తిరిగి KG ఇనుము, స్టీల్ వస్తువులు రూ.20, పేపర్లు రూ.15, గాజు సీసా రూ.2చొప్పున కొనుగోలు చేయాల్సి ఉంటుంది. చెత్త తీసుకుని దానికి తగిన సరకులు ఇవ్వాలి. జనవరి 4లోపు MPDO ఆఫీసులో అప్లికేషన్లు ఇస్తే 9న ఎంపిక చేస్తారు. బంగారుపాళ్యం, చిత్తూరు రూరల్, ఐరాల మండలాల్లో అవకాశం ఉందని జడ్పీ CEO రవికుమార్ నాయుడు చెప్పారు.
Similar News
News January 1, 2026
అనాధలతో చిత్తూరు SP న్యూ ఇయర్ వేడుకలు

నూతన సంవత్సర వేడుకలు అనాధలతో కలిసి ఎస్పీ తుషార్ డూడీ గురువారం నిర్వహించారు. చిత్తూరు తపోవణంలో అనాధ పిల్లలు, వృద్ధులతో కలిసి ఆయన కేక్ కట్ చేశారు. పిల్లలకు కేక్, వృద్ధులకు పండ్లు పంచిపెట్టారు. అనంతరం పిల్లలతో ఆయన ముచ్చటించి వారి ఆశయాలపై ఆరా తీశారు. క్రమశిక్షణతో చదివితే ఉన్నత స్థానానికి చేరుకోవచ్చని చెప్పారు. వృద్ధులతో మాట్లాడుతూ.. అవసరమైన సమయాల్లో పోలీసుల సేవలను వినియోగించుకోవాలని SP సూచించారు.
News January 1, 2026
చిత్తూరు కలెక్టరేట్‌లో మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో రవాణా శాఖ జిల్లా అధికారి నిరంజన్ రెడ్డితో కలిసి ‘జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మాసం ఉత్సవాలు ఈనెల 31వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలను విధిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.
News January 1, 2026
చిత్తూరులో స్కాం.. అజ్ఞాతంలోకి వ్యాపారులు

జీఎస్టీ చీఫ్ కమిషనర్ ఆదేశాలతో చిత్తూరు జిల్లాలో జీఎస్టీ స్కాంపై అధికారులు చర్యలు మొదలుపెట్టారు. కలెక్టర్, ఎస్పీని మంగళవారం కలిసి కుంభకోణంపై చర్చించినట్లు తెలుస్తోంది. స్క్రాప్ స్కామర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎస్పీని, కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం. దీంతో సంబంధిత స్క్రాప్ వ్యాపారులు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.


