News January 1, 2026
నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా వరి సాగు

ఈ యాసంగిలో రాష్ర్టంలో అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలోనే వరి నాటు వేశారు. జిల్లా మొత్తం 1.67 లక్షల ఎకరాల్లో వరి నాటినట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి. మొక్కజొన్న, పసుపు, సోయా, పత్తి, కూరగాయలు అన్ని రకాల పంటలు కలిపి మొత్తం 2.40 లక్షల ఎకరాల్లో సాగు చేశారు. కామారెడ్డి జిల్లాలో 47,905 ఎకరాల్లో వరి నాటారు. పలుచోట్ల ఇంకా నాట్లు వేస్తున్నారు. కూలీల కొరత ఇబ్బంది పెడుతోందని రైతులు చెప్పారు.
Similar News
News January 2, 2026
విజయవాడ పుస్తకాల పండుగ నేటి నుంచే

AP: 36వ విజయవాడ బుక్ ఫెస్టివల్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగనుంది. రోజూ మధ్యాహ్నం 2గంటల నుంచి రాత్రి 9 వరకు ఓపెన్‌లో ఉంటుంది. ఇందుకోసం ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. 280-300 స్టాళ్లలో వేల పుస్తకాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈనెల 6న సీఎం చంద్రబాబు, 9న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యే అవకాశం ఉంది. ప్రతి పుస్తకంపై 10 శాతం రాయితీ ఇవ్వనున్నారు.
News January 2, 2026
చెట్టు నుంచి అరటి గెలలు ఎందుకు ఊడి పడిపోతాయి?

ఒక్కోసారి తోటలలోని కొన్ని అరటి చెట్ల నుంచి గెలలు హఠాత్తుగా ఊడి కిందకు పడిపోతుంటాయి. పంటకు సరైన పోషకాలు అందనప్పుడు, నీటి సదుపాయం ఎక్కువ లేదా తక్కువ అయినప్పుడు ఇలా జరుగుతుంది. అలాగే తక్కువ సూర్యకాంతి తగలడం, ఎక్కువ నీటిని పంటకు పెట్టడం, కాల్షియం లోపం కూడా దీనికి కారణమంటున్నారు నిపుణులు. కొన్నిసార్లు గాలులు, గెల ఆనిన కొమ్మ విరగడం, గెల బరువు ఎక్కువగా ఉండటం కూడా గెల ఊడటానికి కారణమవుతాయి.
News January 2, 2026
నేటి సామెత: కంచె వేసినదే కమతము

పంట పండించే భూమికి (కమతము) రక్షణగా కంచె ఉంటే ఆ భూమిలో అధిక దిగుబడి వస్తుంది. కంచె లేకపోతే పశువులు మేసేయడం లేదా ఇతరులు పాడుచేసే అవకాశం ఉండటం వల్ల దిగుబడి చాలా వరకు తగ్గుతుంది. అంటే, రక్షణ లేని ఆస్తి ఎప్పుడూ ప్రమాదంలోనే ఉంటుంది. మనం జీవితంలో కూడా ఎంత సంపాదించినా, దానికి పొదుపు లేదా క్రమశిక్షణ అనే కంచె లేకపోతే ఆ సంపాదన హరించుకుపోతుందని ఈ సామెత తెలియజేస్తుంది.


