News January 1, 2026

VJA: అమ్మవారిని దర్శించుకున్న హైకోర్టు సిట్టింగ్ జడ్జి

image

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సిట్టింగ్ జడ్జి జస్టిస్ టి.సి.డి. శేఖర్ గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆయనకు ప్రత్యేక దర్శనం చేయించారు. అనంతరం వేద పండితులు ఆయనకు ఆశీర్వచనాలు అందించి, అమ్మవారి ప్రసాదాన్ని అందజేశారు.

Similar News

News January 5, 2026

సూర్యాపేట: ట్యాంకర్ ఢీకొని అసిస్టెంట్ మేనేజర్ మృతి

image

తిరుమలగిరి మండలం తొండ గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యూనియన్ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ సతీష్ (45) దుర్మరణం చెందారు. తన స్వగ్రామం ఐనోలు నుంచి వస్తుండగా, ఎదురుగా వచ్చిన పెట్రోల్ ట్యాంకర్ లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News January 5, 2026

నీళ్లు వృథా కాకుండా ఎవరైనా వాడుకోవచ్చు: సీఎం చంద్రబాబు

image

AP: ఏటా కృష్ణా, గోదావరి నుంచి వేల టీఎంసీలు వృథాగా సముద్రంలో కలుస్తున్నాయని తెలుగు మహా సభలో సీఎం చంద్రబాబు తెెలిపారు. అందుకే ఉమ్మడి ఏపీలోనూ ఎన్నో ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. ఇప్పుడూ నీళ్లు వృథా కాకుండా ఎవరు వాడుకున్నా ఇబ్బంది లేదని స్పష్టం చేశారు. ఇక నదుల అనుసంధానంతో దేశంలో నీటి సమస్య లేకుండా చేయాలని సీఎం చెప్పారు. గంగా-కావేరీ, గోదావరి-పెన్నా నదులు కలవాలన్నారు.

News January 5, 2026

ఆదిలాబాద్: గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

image

ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. 2012 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్ రాథోడ్ విలాస్(38) సోమవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన, సోమవారం ఉదయం ఇచ్చోడలోని తన స్వగృహంలో ఉండగా అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచారు.