News January 1, 2026

VJA: అమ్మవారి ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెల్లవారుజాము నుంచే పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయ అధికారులు, పాలకమండలి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తూ అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూలైన్లు, భద్రత, తాగునీరు, తదితర సౌకర్యాలు కల్పిస్తున్నారు.

Similar News

News January 12, 2026

కడప: పాస్ పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం.. 11మంది MROలకు నోటీసులు

image

రైతులకు పాసు పుస్తకాల పంపిణీలో నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి కొరడా ఝులిపించారు. ఈనెల 2 నుంచి 9వరకు రైతులకు పాసు పుస్తకాలు పంపిణీ చేయాలని ఆదేశించినా అలసత్వం వహించిన తొండూరు MROను కలెక్టర్ సస్పెండ్‌ చేశారు. చెన్నూరు, పెండ్లిమర్రి, VNపల్లె, గోపవరం, పోరుమామిళ్ల, కలసపాడు, చక్రాయపేట, ఖాజీపేట, B.మఠం, ప్రొద్దుటూరు, CKదిన్నే MROలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.

News January 12, 2026

రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ డబుల్ టోర్నమెంట్ విజేతలు వీరే..!

image

కారంచేడు రామానాయుడు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి షటిల్ బ్యాడ్మింటన్ డబుల్ టోర్నమెంట్ పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. మొదటి బహుమతి గుంటూరుకు చెందిన జితేంద్ర టీం, రెండో బహుమతి గన్నవరానికి చెందిన మహీధర్ టీం, మూడో బహుమతి నరసరావుపేటకు చెందిన ధీరజ్ టీం, నాలుగో బహుమతి కారంచేడుకు చెందిన జగన్ టీం గెలుచుకున్నారు. విజేతలకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపి బహుమతులు అందించారు.

News January 12, 2026

యాదాద్రి: వారిపై క్రిమినల్ కేసులు: కలెక్టర్

image

సాంకేతికత దుర్వినియోగం చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని కలెక్టర్ హనుమంతరావు హెచ్చరించారు. సాంకేతికతను దుర్వినియోగం చేయడం చట్ట విరుద్ధమని, జిల్లాలో ప్రభుత్వ ఖజానాకు చెల్లించాల్సిన మొత్తాన్ని తగ్గించి జమ చేసిన ఫైల్స్ అన్నింటిని క్షుణ్ణంగా పరిశీలించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై విచారణకు అదేశించారు.