News January 1, 2026

తిరుమల లడ్డూ విక్రయాల్లో రికార్డ్..!

image

ఈ ఏడాది తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. 2024లో 12.15కోట్ల లడ్డూలు విక్రయించారు. 2025లో 10 శాతం అధికంగా 13.52 కోట్ల లడ్డూలను భక్తులకు అందించారు. డిసెంబర్ 27న ఒక్కరోజే 5.13 లక్షల లడ్డూలు అమ్ముడుబోయాయి. గత దశాబ్దం కాలంలో ఎక్కువ సంఖ్యలో లడ్డూలు విక్రయించడం ఇదే రికార్డ్. లడ్డూ నాణ్యత, రుచి మెరుగుపడటంపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని టీటీడీ తెలిపింది.

Similar News

News January 10, 2026

NZB: అదరగొడుతున్న నిఖత్, హుస్సాముద్దీన్

image

నిజామాబాద్‌కు చెందిన బాక్సర్ నిఖత్ జరీన్ అదరగొడుతోంది. ఆమె ఇప్పటికే రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్ (2022, 2023), ఆసియా క్రీడల్లో కాంస్య పతకం(2023) సాధించిన ఆమె.. తాజాగా సీనియర్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్ షిప్‌లో ఫైనల్ చేరింది. ఆమెతో పాటు జిల్లాకు చెందిన బాక్సర్ హుస్సాముద్దీన్ సైతం ఫైనల్ చేరారు. ఆయన ఇప్పటికే జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌(2023)లో స్వర్ణం గెలిచారు.

News January 10, 2026

HYDలో కరీంనగర్ యువకుడి ఆత్మహత్య

image

ఆర్థిక సమస్యలు తాళలేక ఓ యువ ఆర్కిటెక్ట్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. కరీంనగర్‌కు చెందిన అనుదీప్ ఓ ప్రైవేట్ సంస్థలో ఆర్కిటెక్ట్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా ఆర్థిక సమస్యలతో ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

News January 10, 2026

పిల్లల అభ్యసన సామర్ధ్యాలపై ప్రత్యేక చొరవ

image

ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఎలా చదువుతున్నారనే విషయాలను తెలుసుకోవడానికి విద్యాశాఖ Foundational Literacy& Numeracy ప్రోగ్రాం చేపట్టింది. 75 రోజులు పాటు విద్యార్థులు చదవడం, రాయడం, లెక్కలు వేయడం ఇలా ఎందులో వెనుబడ్డారు అనేది తెలుసుకుంటారు. వీరిని 3 విధాలుగా విభజించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 8 ప్రాథమిక పాఠశాలలు మినహా అన్నింటిలో మెరుగైన ఫలితాలు వచ్చాయని అధికారులు చెబుతున్నారు.