News January 1, 2026
భారత్ అందరిదీ.. RSS చీఫ్ కీలక వ్యాఖ్యలు

డెహ్రాడూన్‌లో త్రిపుర విద్యార్థిపై జరిగిన జాతివివక్ష దాడి నేపథ్యంలో RSS చీఫ్ మోహన్ భాగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘భారతదేశం అందరిది. కులమతాలు, భాష, ప్రాంతం ఆధారంగా ఎవరినీ తక్కువ చేయొద్దు’ అని ఆయన పిలుపునిచ్చారు. విభజన భావాలను వీడి సమానత్వంతో మెలగాలని ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన సభలో సూచించారు. దాడిలో చనిపోయిన విద్యార్థి ఏంజల్ చక్మా మృతి పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ సామాజిక సామరస్యం అవసరమని గుర్తుచేశారు.
Similar News
News February 15, 2026
రైతుభరోసా ఒకే విడతలో.. ?

TG: గతంలో మాదిరి కాకుండా ఈసారి ప్రభుత్వం ఒకే విడతలో రైతుభరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎకరాల చొప్పున డబ్బులు విడుదల చేయడంతో మొత్తం ప్రక్రియ పూర్తయ్యేసరికి 9 రోజుల సమయం పట్టేది. ఈసారి పెట్టుబడికి రైతులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఒకే విడతలో ఖాతాల్లో డిపాజిట్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ నెల 17న రైతుభరోసా నిధులు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
News February 15, 2026
పాకిస్థాన్‌కు ‘ధురంధర్’ డోస్!

T20 WCలో ఇవాళ కొలంబో వేదికగా జరగనున్న IND, PAK మ్యాచుకు ముందు మ్యూజికల్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నారని జాతీయ క్రీడా వర్గాలు తెలిపాయి. ఇందులో ‘ధురంధర్’ సినిమా పాటల్ని ప్లే చేస్తారని, ర్యాపర్ హనుమాన్‌కైండ్ పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారని పేర్కొన్నాయి. పాక్, గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాపై బ్యాన్ విధించిన సంగతి తెలిసిందే. కానీ ఈరోజు ఆ టీమ్‌తో పాటు PCB ఛైర్మన్ మోహ్సిన్ నఖ్వీకి ‘ధురంధర్’ డోస్ తప్పేలా లేదు.
News February 15, 2026
శివుడే విష్ణువు, విష్ణువే శివుడు

శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే|
శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః’||
శివుడు, విష్ణువు వేర్వేరు కాదు. ఒకే పరమాత్మ 2 రూపాలు. విష్ణువు జలతత్వమైతే, శివుడు అగ్నితత్వం. వీటి కలయికే ఈ సృష్టి. శివుని హృదయం విష్ణువు. శివుడు విష్ణువు హృదయం అని పురాణాల వాక్కు. సృష్టిని కాపాడటానికి విష్ణువుగా, లయం చేయడానికి శివుడిగా ఆ పరబ్రహ్మమే అవతరించింది. అందుకే వీరిద్దరినీ ‘హరిహరులు’గా పూజిస్తాం.


