News January 1, 2026
జగిత్యాల: ఎస్సారెస్పీ కాలువలో బాలిక గల్లంతు

మెట్‌పల్లి పట్టణ శివారులోని ఎస్సారెస్పీ కాలువలో విషాదం చోటుచేసుకుంది. తల్లితో కలిసి బట్టలు ఉతకడానికి వెళ్లిన బుట్టి సంజన(11) ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయి గల్లంతయ్యింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పాప కోసం కాలువలో విస్తృతంగా గాలిస్తున్నారు.
Similar News
News January 12, 2026
మద్దూరు: మీ ఇష్టం ఉన్నట్లు సెలవులు తీసుకుంటే కుదరదు: కలెక్టర్

మద్దూరు మండలం లద్నూర్‌లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ హైమావతి తనిఖీ చేశారు. రోగులకు అందించే వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ తనిఖీ చేసి మెడికల్ ఆఫీసర్ సెలవుల్లో ఉన్నట్లు సిబ్బంది తెలపగా అనుమతి తీసుకున్నారా అని డీఎంఅండ్ఎచ్ఓకు ఫోన్ ద్వారా ఆరా తీశారు. సిబ్బంది ఇష్టం ఉన్నట్లు సెలవులు తీసుకుంటే కుదరదని హెచ్చరించారు.
News January 12, 2026
సుందర్ స్థానంలో బదోని

న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో గాయపడి సిరీస్‌కు దూరమైన వాషింగ్టన్ సుందర్ స్థానంలో యంగ్ ప్లేయర్ ఆయుష్ బదోనిని బీసీసీఐ ఎంపిక చేసింది. రెండో వన్డేకు ఆయన జట్టులో చేరనున్నారు. సుందర్ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో ఉన్నట్లు బీసీసీఐ పేర్కొంది. లిస్ట్-ఏ క్రికెట్‌లో బదోని 27 మ్యాచుల్లో 693 రన్స్ చేయగా అందులో ఒక సెంచరీ, ఐదు అర్ధసెంచరీలు ఉన్నాయి. ఇప్పటికే గాయంతో పంత్ ఈ సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే.
News January 12, 2026
చిత్తూరు జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్

చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్‌ను నియమిస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన చిత్తూరుకు బదిలీ అయ్యారు. చిత్తూరులో JC విద్యాధరి విశాఖపట్నం జాయింట్ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.


