News January 1, 2026

కొత్త సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ దాడి.. 24 మంది మృతి

image

రష్యా నియంత్రణలోని ఖేర్సన్‌లో నూతన సంవత్సర వేడుకలపై ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఖోర్లీలోని ఒక హోటల్, కేఫ్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 24 మంది మరణించగా 50 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఒక చిన్నారి ఉన్నట్లు గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే నిప్పు అంటుకునే రసాయనాలతో ఈ దాడులు చేశారని, అర్ధరాత్రి వేళ పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైనదని ఆయన పేర్కొన్నారు.

Similar News

News February 13, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 13, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 13, 2026

ఈ రోజు నమాజ్ వేళలు (FEB 13, శుక్రవారం)

image

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.30 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.44 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.40 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 6.17 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.30 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 13, 2026

ట్విన్స్‌కు పేర్లు పెట్టిన రామ్ చరణ్-ఉపాసన!

image

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్-ఉపాసన దంపతులు తమ ట్విన్స్‌కు పేర్లు పెట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. కూతురి పేరు అన్వీరా దేవి, కుమారుడి పేరు శివ్‌రామ్‌ అని పేర్కొన్నాయి. అన్వీరా దేవి అంటే ధైర్యవంతురాలైన అమ్మవారు అనే అర్థం వస్తుంది. ఇక చిరంజీవి అసలు పేరులోని శివ, రామ్ చరణ్ పేరులోని రామ్‌ను తీసుకొని శివ్‌రామ్ పేరు పెట్టినట్లుగా తెలుస్తోంది. జనవరి 31న ఉపాసన ట్విన్స్‌కు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే.