News January 1, 2026
తిరుమలలో అదనపు లడ్డూ కౌంటర్ల ఏర్పాటు

తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చే భక్తులకు లడ్డూ ప్రసాదం మరింత సౌకర్యవంతంగా పొందేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రసాద విక్రయ కేంద్రం వద్ద అదనపు కౌంటర్లు ఏర్పాటు చేసింది. ఇక్కడ చంటి పిల్లలు కలిగిన భక్తులకు ప్రాధాన్యం ఉంటుంది. రద్దీ పెరిగే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
Similar News
News January 12, 2026
వృద్ధుల కోసం డేకేర్ సెంటర్లు.. నేడే ప్రారంభం

TG: ఒంటరితనంతో బాధపడుతున్న 60yrs+ వృద్ధుల కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 37 ‘ప్రణామ్’ డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. నేడు ప్రజాభవన్‌లో CM రేవంత్ వర్చువల్‌గా 18 సెంటర్లను ప్రారంభించనున్నారు. ఈ కేంద్రాల్లో హెల్త్ చెకప్, యోగా, మెడిటేషన్, టీవీ, కంప్యూటర్, ఇండోర్ గేమ్స్ ఉంటాయి. హాలిడేలు మినహా మిగతా రోజుల్లో (9am-6pm) పనిచేస్తాయి. అటు చిన్నారుల కోసం <<18381207>>’బాల భరోసా’<<>> స్కీమ్‌నూ CM ఈరోజు ప్రారంభిస్తారు.
News January 12, 2026
మంచిర్యాల: ఆరేళ్ల చిన్నారిపై లైంగిక దాడి

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో దారుణం జరిగింది. ఓ గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన మానుమండ్ల రాకేశ్ లైంగిక దాడికి ఒడిగట్టాడు. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను బాలిక తన తల్లికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఎస్సై రాజేందర్ కేసు నమోదు చేసి, నిందితుడు రాకేశ్‌ను అరెస్టు చేశారు. ఆదివారం నిందితుడిని రిమాండ్‌కు పంపినట్లు పోలీసులు తెలిపారు.
News January 12, 2026
కృష్ణా: తల్లి గల్ఫ్‌లో.. కన్నబిడ్డపై కన్నేసిన తండ్రి!

కన్న కూతురిపై తండ్రి అసభ్యంగా ప్రవర్తించిన అమానుష ఘటన కృత్తివెన్నులో చోటుచేసుకుంది. తల్లి గల్ఫ్‌లో ఉండటంతో, 14 ఏళ్ల బాలిక ప. గో (D) మొగల్తూరులోని అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటోంది. అక్కడ తండ్రి వేధింపులకు పాల్పడటంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. మొగల్తూరు పోలీసులు జీరో FIR నమోదు చేసి, తదుపరి దర్యాప్తు కోసం కేసును కృత్తివెన్ను పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.


