News January 1, 2026
రూ.3వేల కోట్ల విడుదలపై కేంద్రం షరతులు

TG: ఎన్నికలు జాప్యం కావడంతో పంచాయతీలకు రావలసిన ₹3000 CR ఫైనాన్స్ కమిషన్ నిధులను కేంద్రం 2023 నుంచి నిలిపి వేసింది. ఇటీవల ఎన్నికలు పూర్తి చేసిన ప్రభుత్వం వివరాలు సమర్పించి నిధులు విడుదల చేయాలని కోరింది. అయితే గతంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఇచ్చిన నిధుల వినియోగంపై ధ్రువపత్రాలు సమర్పించాలని కేంద్రం తాజాగా కొర్రీ వేసింది. దీంతో నిధుల సత్వర విడుదలకు కేంద్ర మంత్రిని కలవాలని మంత్రి సీతక్క నిర్ణయించారు.
Similar News
News January 26, 2026
టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్!

గాయపడ్డ భారత క్రికెటర్ తిలక్ వర్మ న్యూజిలాండ్‌తో ఐదో టీ20 సమయానికి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశముందని క్రీడావర్గాలు పేర్కొన్నాయి. అయితే ఈ సిరీస్‌లో ఆడే అవకాశం లేదని తెలిపాయి. ఫిబ్రవరి 4న దక్షిణాఫ్రికాతో WC వార్మప్ మ్యాచుకు జట్టులో చేరుతారని వెల్లడించాయి. కాగా వరల్డ్‌కప్ ముందు తిలక్ ఫిట్‌నెస్ సాధించడంతో భారత్‌కు ప్రయోజనం చేకూరనుంది. ఆయన చేరికతో జట్టు మరింత పటిష్ఠంగా మారనుంది.
News January 26, 2026
కార్లపై భారీగా టారిఫ్‌లను తగ్గించనున్న భారత్

భారత్, EU మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చర్చల్లో భాగంగా యూరోపియన్ కార్లపై ఉన్న 110 శాతం దిగుమతి సుంకాలను 40 శాతానికి తగ్గించాలని కేంద్రం భావిస్తోంది. తొలుత 15,000 యూరోల కంటే ఎక్కువ ధర ఉన్న కార్లపై పన్ను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. క్రమంగా ఈ టారిఫ్‌లను 10 శాతానికి తగ్గించే అవకాశం ఉంది. ఈ నిర్ణయంతో ఫోక్స్‌వ్యాగన్, మెర్సిడెస్ బెంజ్, BMW వంటి కంపెనీలకు భారత మార్కెట్లో అవకాశాలు పెరుగుతాయి.
News January 26, 2026
భారత్‌కు రిపబ్లిక్ డే శుభాకాంక్షలు: జిన్‌పింగ్

77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత్‌కు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-చైనా మంచి స్నేహితులు, భాగస్వాములు అని పేర్కొన్నారు. కాగా 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల తర్వాత 4 సంవత్సరాల పాటు ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. 2024లో జరిగిన BRICS సదస్సుతో పాటు పలు ద్వైపాక్షిక సమావేశాలతో సంబంధాలు మెరుగయ్యాయి.


