News January 1, 2026
పెద్దపల్లి: పంచాయతీరాజ్ ఉద్యోగుల క్యాలెండర్ ఆవిష్కరణ

పెద్దపల్లి జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో తెలంగాణ పంచాయతీరాజ్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం పెద్దపల్లి జిల్లా శాఖ ఉద్యోగుల క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు రంగు రవి, గౌరవ అధ్యక్షులు ఎం.రమేష్, ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డితో పాటు పూర్ణచంద్ర రావు, కరుణాకర్, సాదిక్ పాషా, ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ సిబ్బంది హాజరయ్యారు.
Similar News
News February 11, 2026
పార్వతీపురం: టెన్త్ విద్యార్థులకు రేపే లాస్ట్ ఛాన్స్

ఏపీలో మార్చి 16 నుంచి టెన్త్ పరీక్షలు జరగనున్నాయి. పార్వతీపురం జిల్లాలో మొత్తం 10,882 మంది పదో తరగతి విద్యార్థులు ఉన్నారని DEO బ్రహ్మాజీరావు తెలిపారు. వీరి కోసం 67 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్తులో టెన్త్ మార్కుల లిస్ట్ అన్నింటికీ కీలకం కావడంతో అందులో తప్పులు ఉంటే ఇబ్బందులు వస్తాయని ఆయన పేర్కొన్నారు. వివరాల్లో తప్పులు ఉంటే FEB-12 లోగా HMలను సంప్రదించి సరిచేసుకోవాలని సూచించారు.
News February 11, 2026
సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ధ ప్రకాశ్

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ నూతన ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి డా.జ్యోతి బుద్ధ ప్రకాశ్ నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఉన్న ఆయనను బదిలీ చేసి సింగరేణి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటి వరకు ఇన్-ఛార్జ్ సీఎండీగా ఉన్న డి.కృష్ణభాస్కర్‌ను ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.
News February 11, 2026
WGL: 9 గంటల వరకు 12.44 శాతం పోలింగ్

వరంగల్ జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో తొలి రెండు గంటల్లో జిల్లా వ్యాప్తంగా సగటున 12.44 శాతం ఓటింగ్ నమోదైంది. వర్ధన్నపేట మున్సిపాలిటీలో 13.02 శాతంతో ఓటర్లు చైతన్యం చూపగా, నర్సంపేటలో 12.29 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.


