News January 1, 2026
మామునూర్ ఎయిర్‌పోర్ట్‌కు అడుగులు.. పెరగనున్న ధరలు!

మామునూర్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఎయిర్‌పోర్టుకు అవసరమైన 253 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాకు అప్పగించింది. ఎయిర్‌పోర్టుకు మార్చిలో ప్రధాని శంకుస్థాపన చేయనుండటంతో భవిష్యత్తు అభివృద్ధి దృష్ట్యా ప్లాట్ల కొనుగోళ్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం ఇక్కడ గజానికి రూ.10-12వేల వరకు ధర పలుకుతుండగా, శంఖుస్థాపన జరిగితే ధరలు అమాంతం పెరగనున్నాయి.
Similar News
News January 4, 2026
ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియాలో పోస్టులు

ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (<
News January 4, 2026
‘జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే?’.. ట్రంప్‌పై రో ఖన్నా ఫైర్!

వెనిజులా అధ్యక్షుడు మదురో అరెస్ట్‌ను భారత సంతతి US MP రో ఖన్నా తప్పుబట్టారు. ఇది ఒక అనవసర యుద్ధమని విమర్శించారు. ‘ఇలాంటి దాడుల వల్ల ప్రపంచానికి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. రేపు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని పుతిన్ బంధిస్తే? లేదా తైవాన్ నేతలపై చైనా దాడి చేస్తే అప్పుడు మనం ఏమనగలం?’ అని ప్రశ్నించారు. ఈ చర్య వల్ల అంతర్జాతీయ వేదికపై అమెరికా నైతిక బలాన్ని కోల్పోతుందని రో ఖన్నా అభిప్రాయపడ్డారు.
News January 4, 2026
చిత్తూరు: ఉపాధిపై రేపు గ్రామసభలు

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 5వ తేదీన గ్రామసభలు నిర్వహించనున్నట్లు డీపీవో సుధాకర రావు తెలిపారు. నిరుపేదలకు ఉపాధి హామీ కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇటీవల కేంద్రం వికసిత్ భారత్ వీబీజీ రామ్ జీగా మార్పు చేసినట్లు తెలిపారు. పథకం మార్పులపై గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని చెప్పారు. పథకంపై సభలలో అవగాహన కల్పిస్తామన్నారు.


