News January 1, 2026

చందన్వెల్లి చౌరస్తా.. ప్రపంచపు డిజిటల్ గల్లా పెట్టె!

image

వాట్సాప్‌ స్టేటస్ పెట్టినా, నెట్‌ఫ్లిక్స్‌లో మూవీ చూసినా ఆ డేటా వచ్చి చేరే ‘ప్రపంచపు డిజిటల్ లాకర్’ మన చేవెళ్లలో ఉంది. చందన్వెల్లి-షాబాద్ బెల్ట్ ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గజాలకు అడ్డా. గ్లోబల్ కంపెనీలు ₹లక్షల కోట్లు కుమ్మరిస్తున్నాయి. RRR కనెక్టివిటీ తోడైతే ఇండియాకే ‘డిజిటల్ పవర్ హౌస్’ కానుంది. పొలాలకు C/O అడ్రసైన ప్రాంతం, ఇప్పుడు ప్రపంచపు డేటాకు సెక్యూరిటీ గార్డ్‌లా మారుతోంది.

Similar News

News January 3, 2026

KMM: లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే ఆస్పత్రులు సీజ్: డీఎంహెచ్‌ఓ

image

ఖమ్మం జిల్లాలో నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే ఆస్పత్రులను సీజ్ చేస్తామని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రామారావు హెచ్చరించారు. పీసీపీఎన్డీటీ చట్టాన్ని ఉల్లంఘించే స్కానింగ్ సెంటర్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆడపిల్లల సంరక్షణ అందరి బాధ్యతని, చట్టవిరుద్ధంగా భ్రూణ హత్యలకు ప్రోత్సహిస్తే జైలు శిక్ష తప్పదని స్పష్టం చేశారు. వైద్యులు, యజమానులు నిబంధనలకు లోబడి పనిచేయాలన్నారు.

News January 3, 2026

KMM: కానిస్టేబుల్ ఇంట్లోనే 37 తులాల బంగారం చోరీ

image

రఘునాథపాలెం మండలం కోయచలకలో మహిళా కానిస్టేబుల్ పూజిత ఇంట్లో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. దంపతులు విధులకు వెళ్లిన సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 37.7 తులాల బంగారం, నగదు దోచుకెళ్లారు. బాధితురాలి ఫిర్యాదుతో సీఐ ఉస్మాన్ షరీఫ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పాత నేరస్థుల పనేనని అనుమానిస్తున్నారు. పోలీస్ ఇంట్లోనే దొంగతనం జరగడం స్థానికంగా కలకలం రేపింది.

News January 3, 2026

అల్లూరి: పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

చింతూరు మండలం బొడ్రాయిగూడెం గ్రామానికి చెందిన ఎస్.రామయ్య (38) పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఎస్ఐ రమేశ్ శుక్రవారం తెలిపారు. ఎస్ఐ చెప్పిన వివరాల మేరకు.. తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతున్న రామయ్య ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు అతడని చింతూరు ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడన్నారు. ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ పేర్కొన్నారు.