News January 1, 2026

సిరిసిల్ల: ‘జిల్లాలో నెలరోజుల పాటు పోలీస్ యాక్ట్ అమలు’

image

జిల్లాలో నెల రోజులపాటు పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గితే తెలిపారు. పోలీస్ యాక్ట్ 1861 ప్రకారం వచ్చే నెల రోజులలో జిల్లా పరిధిలో పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు, ప్రదర్శనలు నిషేధమని ఆయన పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Similar News

News January 3, 2026

నెల్లూరు జిల్లాలో 19 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

నెల్లూరు జిల్లాలోని KGBVలో 19 బోధనేతర పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య ఓ ప్రకటనలో కోరారు. శనివారం నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. అభ్యర్థులు తమ అప్లికేషన్లను నెల్లూరులోని సమగ్రశిక్ష కార్యాలయంలో అందజేయాలని కోరారు.

News January 3, 2026

14,582పోస్టులు.. టైర్- 2 ఎగ్జామ్స్ తేదీల ప్రకటన

image

కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL)-2025 టైర్ 2 పరీక్ష తేదీలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<>SSC<<>>) ప్రకటించింది. జనవరి 18న స్కిల్ టెస్ట్, జనవరి 19న మ్యాథమెటికల్ ఎబిలిటీస్ అండ్ రీజనింగ్& జనరల్ ఇంటెలిజెన్స్, ఇంగ్లిష్ లాంగ్వేజ్&కాంప్రహెన్షన్ అండ్ జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్, స్టాటిస్టిక్స్ పరీక్ష నిర్వహించనుంది. ఈ పరీక్ష ద్వారా 14,582 పోస్టులను భర్తీ చేయనుంది.

News January 3, 2026

BJPని చూసి RSSను అర్థం చేసుకోవద్దు: మోహన్ భాగవత్

image

‘‘RSS యూనిఫాం, వ్యాయామాలను చూసి పారా మిలిటరీ అనుకోవద్దు. అలాగే BJPని చూసి సంఘ్‌ను అర్థం చేసుకోవడం పెద్ద పొరపాటు’’ అని సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. సమాజాన్ని ఏకం చేసి, విదేశీ శక్తుల చేతుల్లో భారత్ మళ్లీ చిక్కకుండా చూడటమే సంఘ్ లక్ష్యమని భోపాల్‌ (MP)లో మాట్లాడుతూ చెప్పారు. వికీపీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలు నమ్మకుండా, అసలు విషయం తెలుసుకోవడానికి నేరుగా ‘శాఖ’కు వచ్చి చూడాలని ఆయన పిలుపునిచ్చారు.