News January 1, 2026
నాగర్ కర్నూల్: ‘స్కాలర్షిప్‌లకు దరఖాస్తు చేసుకోండి’

నాగర్ కర్నూల్ 2024-25 విద్యా సంవత్సర పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్‌లకు మార్చి 31 వరకు దరఖాస్తు చేసుకోవాలని షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి ఉమాపతి తెలిపారు. epass.cgg.gov.in వైబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు కులం, ఆదాయం ధ్రువ పత్రాలతో పాటు ఆధార్ నంబర్ అనుసంధానం చేసిన బ్యాంకు ఖాతా వివరాలను ఇవ్వాలని సూచించారు.
Similar News
News January 13, 2026
కుక్క కాటు మరణాలకు భారీ పరిహారం: SC

శునకాల నియంత్రణలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు ఘోరంగా విఫలం అయ్యాయని సుప్రీంకోర్టు మండిపడింది. ఎవరికైనా కుక్క కరిచి మరణిస్తే భారీ పరిహారం అందించేలా ఆదేశిస్తామని స్పష్టం చేసింది. కాగా ఏకపక్షంగా కాకుండా, సమగ్ర పరిష్కారం చూపాలని డాగ్ లవర్స్ SCని కోరారు. ప్రజలు వాటిని దత్తత తీసుకునేలా ఇన్సెంటివ్స్ ప్రకటించాలని సూచించారు. దీంతో అనాథలు, రోడ్లపై అభాగ్యులకు ఇది చేయొచ్చుగా? అని ధర్మాసనం ధ్వజమెత్తింది.
News January 13, 2026
ముగ్గులతో ఆరోగ్యం..

సంక్రాంతి నెల వచ్చిందంటే చాలు ముగ్గులూ వాటి మీద ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలు కనువిందు చేస్తుంటాయి. హేమంతరుతువులో సూర్యుడు భూమికి దూరంగా ఉండటం వల్ల వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాదులతో వ్యాధులు ప్రబలే అవకాశముంది. ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి గుల్లసున్నంతో ముగ్గులేయడం, గొబ్బెమ్మలను పెట్టడం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. వంగి ముగ్గులు వేయడం వల్ల శరీరానికి వ్యాయామం ఏర్పడుతుంది.
News January 13, 2026
ముగ్గు వేస్తే ఆరోగ్యం..

ఉదయాన్నే ముగ్గు వేస్తే మహిళలకు వ్యాయామం అవుతుంది. ఇది వెన్నెముకను దృఢపరుస్తుంది. జీర్ణక్రియను, పునరుత్పత్తి అవయవాల పనితీరును మెరుగుపరుస్తుంది. చేతులు, కాళ్ల కదలికల వల్ల శరీరానికి చక్కని మసాజ్ అందుతుంది. స్వచ్ఛమైన గాలిని పీల్చడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. బియ్యప్పిండితో ముగ్గు వేస్తే చీమలు, పిచ్చుకల వంటి జీవులకు ఆహారం లభిస్తుంది. ఈ ప్రాసెస్ ఏకాగ్రతను పెంచే ఒక అద్భుతమైన మెడిటేషన్ వంటిది.


