News April 24, 2024
వచ్చే ఏడాది సుడిగాడు-2: నరేశ్

అల్లరి నరేశ్ కెరీర్లో గుర్తుండిపోయే చిత్రాల్లో ‘సుడిగాడు’ ఒకటి. స్పూఫ్ కామెడీ సీన్లతో తెరకెక్కిన ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమా సీక్వెల్‌పై ఓ ఈవెంట్‌లో నరేశ్ కీలక అప్డేట్ ఇచ్చారు. సుడిగాడు-2 కోసం తానే రచయితగా మారి కథ రాస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది ఆ సినిమాను చూడొచ్చని చెప్పారు.
Similar News
News March 18, 2026
‘ధురంధర్: ది రివెంజ్’ తెలుగు ప్రీమియర్స్ రద్దు?

‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా తెలుగు ప్రీమియర్స్ రద్దయినట్లు తెలుస్తోంది. కంటెంట్ డెలివరీలో ఆలస్యం కారణంగా తెలుగు, తమిళ వెర్షన్ల ప్రీమియర్స్ క్యాన్సల్ అయినట్లు సినీవర్గాలు తెలిపాయి. హిందీ వెర్షన్ షోలు మాత్రం ప్రదర్శిస్తారని వెల్లడించాయి. అడ్వాన్స్ బుకింగ్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేసినప్పటికీ.. టెక్నికల్ సమస్యలు మూవీ విడుదలను ఆలస్యం చేసినట్లు సమాచారం. కాగా రేపటి నుంచి రెగ్యులర్ షోలు ఉండనున్నాయి.
News March 18, 2026
‘PAN’ కార్డుకు అప్లై చేస్తున్నారా?

కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పాన్ కార్డు అప్లికేషన్ నిబంధనల్లో మార్పులు రానున్నాయి. ప్రస్తుతం పాన్ కార్డు పొందేందుకు ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. కానీ ఏప్రిల్ 1 నుంచి ఆధార్‌తో పాటు బర్త్ సర్టిఫికెట్, ఓటర్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌లో ఏదో ఒక ప్రూఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి PAN అప్లికేషన్ ఫామ్స్ కూడా చెల్లవని ప్రభుత్వం పేర్కొంది. అలాగే ఆధార్‌పై ఉన్న పేరునే PAN కార్డుపై ముద్రిస్తారు.
News March 18, 2026
గుడ్‌న్యూస్.. 60% సీట్లపై నో ఎక్స్‌ట్రా ఛార్జ్

విమాన సీట్ల సెలక్షన్ ఛార్జీల పేరుతో ఎయిర్‌లైన్స్ కంపెనీలు చేస్తున్న అదనపు వసూళ్లకు కేంద్రం చెక్ పెట్టింది. కనీసం 60% సీట్లను ఎటువంటి ఎక్స్‌ట్రా ఛార్జ్ లేకుండా కేటాయించాలని DGCA ఆదేశించింది. ఒకే PNRపై ప్రయాణించే కుటుంబ సభ్యులను పక్కపక్క సీట్లలోనే కూర్చోబెట్టాలని స్పష్టం చేసింది. విమానాల రద్దు, ఆలస్యం వంటి సందర్భాల్లో ప్రయాణికుల హక్కులను లోకల్ లాంగ్వేజెస్‌లో డిస్‌ప్లే చేయాలని పేర్కొంది.


