News January 1, 2026

విశాఖలో తొలిసారిగా మొబైల్ వాటర్ టెస్టింగ్ లాబొరేటరీ

image

ప్రజల ఆరోగ్య భద్రత దృష్ట్యా రాష్ట్రంలోనే మొట్ట మొదటగా విశాఖ నగరంలో మొబైల్ వాటర్ టెస్టింగ్ లేబొరేటరీను గురువారం జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ ప్రారంభించారు. నగరంలోని అన్ని వార్డుల పరిధిలో ఉన్న నివాస ప్రాంతాల వద్దకే ఈ వాహనం నేరుగా వెళ్తుందన్నారు. ప్రజలు తాము తాగే నీరు ఎంతవరకు సురక్షితమో అక్కడికక్కడే తెలుసుకోవచ్చన్నారు. నగర ప్రజలందరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

Similar News

News January 5, 2026

విశాఖలో నో వెహికల్ జోన్ ఉందా? లేదా?

image

విశాఖ నగరంలో కాలుష్య నివారణకు జీవీఎంసీ పటిష్ట చర్యలను చేపట్టి గతంలో ప్రతి సోమవారం ‘నో వెహికల్ జోన్’ ప్రకటించింది. దీంతో జీవీఎంసీ మేయర్, కమిషనర్ సైతం ఆర్టీసీ బస్సులలో, సైకిల్ పైనా జీవీఎంసీ కార్యాలయానికి వచ్చేవారు. ఆ విధంగా వస్తూ ప్రతివారం వార్తలలో కనిపించేవారు. అయితే మేయర్ మారిన తరువాత నుంచి నో వెహికల్ జోన్‌పై వార్తా కథనాలు రాకపోవడంతో అసలు నో వెహికల్ జోన్ ఉందా లేదా అని ప్రజల ప్రశ్నిస్తున్నారు.

News January 5, 2026

తిమ్మాపురం బీచ్‌లో వృద్ధురాలి మృతి

image

తిమ్మాపురం బీచ్ సమీపంలోని కమ్యూనిటీ హాల్ వద్ద గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందింది. 70 సంవత్సరాలు వయసున్న వృద్ధురాలు బీచ్ సమీపంలో రెండు రోజులుగా తిరుగుతూ ఉండగా స్థానికులు ఆహారం, దుప్పట్లు ఆమెకు ఇచ్చారు. ఆదివారం ఆమె మృతి చెందినట్లు గమనించి భీమిలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 5, 2026

​నేడే విశాఖ కలెక్టరేట్‌లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’

image

విశాఖపట్నం కలెక్టరేట్‌లో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ (PGRS) నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుండి ప్రజలు తమ సమస్యలపై అర్జీలు అందజేయవచ్చని, పాత అర్జీదారులు రసీదులు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఫిర్యాదుల స్థితిగతుల కోసం ‘1100’ కాల్ సెంటర్ లేదా అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించాలని, ఈ అవకాశాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.