News April 24, 2024
హైదరాబాద్‌లో తగ్గిన రిజిస్ట్రేషన్లు

HYDలో మార్చి నెలలో 6,416 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. గతేడాదితో పోలిస్తే 8 శాతం తగ్గాయి. ఫిబ్రవరిలో 7,135 రిజిస్ట్రేషన్లు జరగ్గా.. 10% తగ్గినట్లు రియల్ ఎస్టేట్ సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. మొత్తం రిజిస్ట్రేషన్లలో రంగారెడ్డి జిల్లాలో 46%, మేడ్చల్ మల్కాజిగిరిలో 40%, హైదరాబాదులో 10%, సంగారెడ్డిలో ఒక శాతం ఉన్నట్లు వెల్లడించింది.
Similar News
News October 30, 2025
హైదరాబాద్‌లో నేటి వాతావరణం ఇలా

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు పాక్షికంగా ఆకాశం మేఘావృతంగా ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. ‘సాయంత్రం లేదా రాత్రి సమయంలో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం, చిరు జల్లులు పడే అవకాశం ఉంది. ఉదయం, రాత్రి వేళల్లో పొగమంచు కనిపించే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 29°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 21°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. నైరుతి దిశలో గంటకు 04- 08 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి’ అని పేర్కొంది.
News October 30, 2025
కోల్‌కత్తాలో తప్పించుకున్నా శంషాబాద్‌లో దొరికాడు

విశాల్ అనే వ్యక్తి కోల్‌కత్తా నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్ వచ్చాడు. ఆ తర్వాత అతడు మరో విమానంలో బెంగళూరు వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ క్రమంలో అతడి లగేజీని భద్రతా సిబ్బంది తనిఖీ చేయగా బుల్లెట్ (38MM లైవ్ బుల్లెట్ ) బయటపడింది. దాని గురించి వివరాలు అడగ్గా సరైన సమాధానం లేదు. దీంతో ఆర్జీఐఏ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.
News October 30, 2025
అంతటా 20మంది లోపే.. జూబ్లీహిల్స్‌లోనే 58 మంది

వచ్చేనెల 11న జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 58 మంది బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా జూబ్లీహిల్స్‌తో సహా మరో 7 చోట్ల బైపోల్స్ జరుగుతున్నాయి. అక్కడ మాత్రం పోటీచేస్తున్న వారి సంఖ్య 20లోపే ఉంది. బుడ్గాంలో 17(J&K), నగ్రోతలో 10(J&K), ఘట్సిలలో 13(ఝార్ఖండ్), డాంపలో 5 (మిజోరం), నువపడలో 14(ఒడిశా), తర్నతరన్లో 15(పంజాబ్), అంటలో 15(రాజస్థాన్) మంది పోటీలో ఉన్నారు.


