News January 1, 2026

సింహాచలం ప్రసాదంలో నత్త ఘటన.. విచారణ ముమ్మరం

image

సింహాచలం అప్పన్న ప్రసాదంలో నత్త కనిపించిందన్న ఘటనపై దేవాదాయ శాఖ విచారణ ముమ్మరం చేసింది. ఈవో సుజాత, ఏఈఓ రమణమూర్తిలను సీపీ విచారించి, నివేదికతో పాటు సీసీ ఫుటేజీ సమర్పించాలని ఆదేశించారు. ప్రసాదం తయారీలో నత్త పడే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేస్తూ, ఉద్దేశపూర్వకంగా తప్పుడు వీడియో ప్రచారం చేసిన జంటపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత 30 ఏళ్లలో ఇలాంటి ఘటన ఎప్పుడూ జరగలేదని ఏఈఓ రమణమూర్తి పేర్కొన్నారు.

Similar News

News January 11, 2026

కడప: టెన్త్ అర్హతతో ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

YSR కడప జిల్లాలోని GGH, CCCలో 34 పోస్టుల భర్తీకి మెడికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ పాసైనవారు JAN 5 నుంచి 12వరకు అప్లై చేసుకోవచ్చు. అటెండెంట్, MNO, FNO, స్ట్రెచర్ బాయ్ పోస్టులు ఉన్నాయి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, BC, EWS అభ్యర్థులకు రూ.250. వెబ్‌సైట్: https://kadapa.ap.gov.in/

News January 11, 2026

కామారెడ్డి: దొరకని ఆచూకీ.. ఆగని కన్నీరు!

image

మంజీరా నదిలో నాణేల కోసం వెళ్లి పిట్లం మండలం బొల్లక్‌పల్లి వాసి <<18817781>>తడబోయిన సాయిలు(42) గల్లంతైన<<>> విషయం విదితమే. రంగంలోకి దిగిన గజ ఈతగాళ్లు శనివారం రోజంతా నదిలో గాలించినా ఫలితం లేకపోయింది. ఆదివారం రెండో రోజు కూడా విపత్తు నిర్వహణ బృందం సభ్యులు నదిలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినా మృతదేహం ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. మృతదేహం కోసం కుటుంబ సభ్యులు నది ఒడ్డున కన్నీరుమున్నీరుగా వేచి చూస్తున్నారు.

News January 11, 2026

ట్రంప్ టారిఫ్స్.. TNలో 30 లక్షల ఉద్యోగాలకు ముప్పు!

image

ఇండియాపై ట్రంప్ విధించిన టారిఫ్స్ వల్ల తమ రాష్ట్రంలో లక్షల ఉద్యోగాలు రిస్క్‌లో పడ్డాయని తమిళనాడు ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. ‘TN గూడ్స్ ఎగుమతుల్లో 31% USకే వెళ్తాయి. సుంకాల వల్ల టెక్స్‌టైల్ రంగంపై తీవ్ర ప్రభావం పడింది. 30 లక్షల ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయి. MSMEలు మూతబడేలా ఉన్నాయి’ అని రాష్ట్ర ఆర్థిక మంత్రి తంగమ్ తెన్నరసు చెప్పారు. వస్త్ర రంగం కోసం ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని కోరారు.