News January 1, 2026
నిర్మల్: స్కాలర్ షిప్ దరఖాస్తు తేదీ పొడిగింపు

నిర్మల్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలో ఇంటర్, డిగ్రీ, సాధారణ వృత్తి నైపుణ్య కోర్సులు చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు 2025-26 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాల దరఖాస్తు తేదీ పొడిగించినట్లు ఎస్సీ కులాల అభివృద్ధి అధికారి దయానంద్ తెలిపారు. దరఖాస్తు గడువు మార్చి 31, 2026 వరకు పొడిగించామన్నారు. విద్యార్థులు www.telangana.epass వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Similar News
News January 7, 2026
సూర్యాపేట: డీఎస్పీ నరసింహాచారికి పోలీస్ సేవా పతకం

సూర్యాపేట జిల్లా పోలీస్ సాయుధ విభాగంలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీ నరసింహాచారిని రాష్ట్ర స్థాయి పోలీస్ సేవా పతకం వరించింది. నూతన సంవత్సరం సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ప్రతిభ అవార్డుల్లో ఆయన చోటు దక్కించుకున్నారు. ఈ మేరకు ఈరోజు ఎస్పీ నరసింహను డీఎస్పీ మర్యాదపూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో విశిష్ట ప్రతిభ కనబరిచినందుకు డీఎస్పీని ఎస్పీ అభినందించి శుభాకాంక్షలు చెప్పారు.
News January 7, 2026
చంద్రబాబును కలిసిన ఎంపీ మాగుంట

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం చంద్రబాబును ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలోని ఎయిర్పోర్ట్ వద్ద స్వాగతం పలికి పుష్పగుచ్ఛాన్ని అందించారు. కాగా ఢిల్లీలో ఉన్న మాగుంట ఈనెల 9న ఒంగోలుకు రానున్నారు. 9, 10న స్థానికంగా జరిగే పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 10న ఒంగోలు పీవీఆర్ బాలుర మున్సిపల్ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగే శతాబ్ది ఉత్సవాలకు హాజరవుతారు.
News January 7, 2026
అమిత్ షాతో సీఎం చంద్రబాబు భేటీ

AP CM చంద్రబాబు ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, నియామకాలపై చర్చించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రానికి తగిన నిధులు కేటాయించాలని వినతి పత్రాలు అందజేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్న నిధులు, పెండింగ్ అంశాలు, అమరావతి శాశ్వత రాజధాని బిల్లుపైనా చర్చించారు. బడ్జెట్ సమావేశాల్లో అమరావతి శాశ్వత రాజధాని బిల్లు పెట్టే అవకాశం ఉంది.


