News January 1, 2026

గన్నేరువరం: మానసా దేవి ఆలయానికి పోటెత్తిన భక్తులు

image

ఆంగ్ల నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గన్నేరువరం మండలం కాసింపేట సుప్రసిద్ధ స్వయంభు మానసా దేవి ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు గురువారం పోటెత్తారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవార్ల దర్శనానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవార్ల దర్శనానికి క్యూలైన్లలో గంటల తరబడి ఓపికగా నిలబడ్డారు. అమ్మవార్లను దర్శించుకుని పెద్ద సంఖ్యలో ముడుపులు సమర్పించారు.

Similar News

News January 13, 2026

కడప: భర్త SP.. భార్య JC

image

కడప JCగా నూతనంగా నిధి మీనా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమె ప్రస్తుతం కడప జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న షెల్కే నచికేత్ విశ్వనాథ్ సతీమణి. ఈమెది 2019 ఐఏఎస్ బ్యాచ్. మొదటగా తెనాలి సబ్ కలెక్టర్‌గా పనిచేశారు. ఆ తర్వాత వయోజన విద్య డైరెక్టర్‌గా, ఎన్టీఆర్ JCగా విధులు నిర్వహించారు. ఇప్పటివరకు కడప JCగా పనిచేసిన అదితిసింగ్ ప్రసూతి సెలవులో ఉన్నారు.

News January 13, 2026

భోగి పళ్లలో ఏమేం ఉండాలి?

image

భోగి పళ్ల మిశ్రమంలో ప్రధానంగా రేగుపళ్లు ఉండాలి. వీటితో పాటు చిన్న చెరుకు ముక్కలు, శనగలు, చిల్లర నాణాలు, బంతిపూల రేకులు కలపాలి. కొన్ని ప్రాంతాల్లో వీటికి అదనంగా బియ్యం, నల్ల నువ్వులు కలుపుతారు. రేగుపళ్లు సూర్య భగవానుడికి ప్రీతిపాత్రమైనవి. నాణాలు లక్ష్మీదేవికి సంకేతం. ఈ వస్తువులన్నీ కలిపి పిల్లల తలపై పోయడం వల్ల వారిలోని గ్రహ దోషాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం సిద్ధిస్తాయని సంప్రదాయం చెబుతోంది.

News January 13, 2026

మామిడి ఆకులపై బుడిపెల నివారణ ఎలా?

image

కొన్ని తోటల్లో మామిడి చెట్ల ఆకులపై బుడిపెలు కనిపిస్తూ ఉంటాయి. వీటి వల్ల ఆకులు ఎండి, రాలిపోతుంటాయి. మీడ్జ్ పురుగు ఆశించడం వల్ల ఆకులపై ఈ బొడిపెలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు. వీటి నివారణకు 100 లీటర్ల నీటిలో అజాడిరక్టిన్ (3000 పి.పి.ఎం) 300ml + క్లోరిపైరిఫాస్ 250mlను కలిపి చెట్ల ఆకులు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి. స్థానిక వ్యవసాయ అధికారుల సూచనల మేరకు ఈ మందును పిచికారీ చేయడం మంచిది.