News January 1, 2026
క్షయ వ్యాధి రహిత జిల్లానే లక్ష్యం: కలెక్టర్

శ్రీ సత్యసాయి జిల్లాను క్షయ వ్యాధి (టీబీ) రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేయాలని కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో పెనుకొండ టీబీ యూనిట్ పరిధిలోని 10 మంది టీబీ రోగులను ‘నిక్షయ్ మిత్ర’ పథకం కింద దత్తత తీసుకున్నారు. వారికి అవసరమైన పోషకాహార కిట్లను కలెక్టర్ అందజేశారు.
Similar News
News January 3, 2026
‘ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అంటే ఎట్లా?: జైశంకర్

పాక్‌తో సింధూ జలాల ఒప్పందం నిలిపేవేతపై విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ‘‘పాక్ దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తోంది. మీరు సరైన నైబర్‌గా లేకపోతే ఓ మంచి పొరుగు దేశం నుంచి ప్రయోజనాలు పొందలేరు. ‘మీపైకి ఉగ్రవాదాన్ని ఎగదోస్తా.. నాకు నీళ్లివ్వండి’ అని అడిగితే ఎట్లా?’’ అని ప్రశ్నించారు. ఉగ్రవాదం నుంచి రక్షించుకునే హక్కు ఇండియాకు ఉందని, ఆ హక్కును ఎలా ఉపయోగించుకోవాలో ఎవరూ నిర్దేశించలేరని స్పష్టంచేశారు.
News January 3, 2026
KMR: సంక్రాంతికి ఇంటికి తాళం వేసి వెళ్తున్నారా.. జాగ్రత్త!

సంక్రాంతి పండుగ వేళ ఊళ్లకు వెళ్లే ప్రజలు తమ ఇళ్లకు రక్షణ కల్పించుకోవడంలో అప్రమత్తంగా ఉండాలని SP రాజేష్ చంద్ర పేర్కొన్నారు. ఇంటి ముందు వెనుక భాగాల్లో రాత్రిపూట లైట్లు వెలిగేలా ఏర్పాటు చేయండి. బంగారు ఆభరణాలు, నగదును వెంట తీసుకెళ్లడం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవడం ఉత్తమం అని అన్నారు. మీ వీధిలో అనుమానిత వ్యక్తులు లేదా కొత్తవారు సంచరిస్తున్నట్లు కనిపిస్తే వెంటనే 100కి కాల్ చేయాలని సూచించారు.
News January 3, 2026
ధనుర్మాసం: పంతొమ్మిదో రోజు కీర్తన

హంస తూలికా తల్పంపై పవళించిన స్వామిని మాట్లాడమని వేడుకుంటున్నారు. కృష్ణుడిని క్షణ కాలం కూడా విడవలేని నీళాదేవిని ఉద్దేశించి ‘తల్లీ! నీ నిరంతర సాన్నిధ్యం నీ స్వభావానికి తగినదే! కానీ, మమ్మల్ని కూడా కరుణించి స్వామి సేవలో పాల్గొనే అవకాశమివ్వు’ అని అడుగుతున్నారు. జగన్మాత అయిన నీళాదేవి అనుమతి వస్తేనే తమ ధనుర్మాస వ్రతం సఫలమై, భగవత్ కైంకర్యం సిద్ధిస్తుందని గోదాదేవి ఆర్తితో విన్నవిస్తున్నారు. <<-se>>#DHANURMASAM<<>>


