News January 1, 2026
హెల్మెట్‌కు పాలస్తీనా జెండా.. JK11 ప్లేయర్ అరెస్ట్

పాలస్తీనా జెండా ఉన్న హెల్మెట్ పెట్టుకుని డొమెస్టిక్ లీగ్ క్రికెట్ మ్యాచ్ ఆడిన JK11 టీమ్ ప్లేయర్ ఫుర్కాన్ భట్‌ను జమ్మూ రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ & కశ్మీర్ ఛాంపియన్స్ లీగ్‌లో భాగంగా జమ్మూ ట్రయల్ బ్లేజర్స్‌తో నిన్న జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లీగ్ నిర్వాహకుడు జహీద్ భట్‌ను కూడా విచారించనున్నారు.
Similar News
News February 3, 2026
రేపు ఢిల్లీలో NDA పార్లమెంటరీ పార్టీ సమావేశం

ప్రధాని మోదీ అధ్యక్షతన రేపు ఉదయం ఢిల్లీలో NDA కీలక సమావేశం జరపనుంది. ఈ భేటీలో బడ్జెట్ విశేషాలు, వికసిత్ భారత్@2047 విజన్, పార్లమెంటరీ అజెండాలపై చర్చించనున్నారు. FM నిర్మల బడ్జెట్ అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనుండగా, మోదీ MPలకు దిశానిర్దేశం చేస్తారు. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా వ్యూహరచన చేయనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ, జనసేన సహా కూటమి పార్టీల ఎంపీలు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.
News February 3, 2026
తెలుగువారి 52 ఏళ్ల ట్రైన్.. అరుదైన అవార్డు

హైదరాబాద్-విశాఖ మధ్య 52 ఏళ్లుగా సేవలందిస్తున్న గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు అరుదైన గౌరవం దక్కింది. 2025కు గాను బెస్ట్ మెయింటేన్డ్ ట్రైన్ అవార్డు లభించింది. ‘1974 నుంచి ఇదొక ట్రైన్ కంటే ఓ గొప్ప ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకుంది. ట్రైన్ నంబర్ 12728 సెలబ్రేషన్స్ గొప్పగా నిర్వహించాం’ అని SCR ట్వీట్ చేసింది. ఈ రైలుతో మీకున్న అనుబంధంపై కామెంట్ చేయండి.
News February 3, 2026
భారత్‌పై టారిఫ్‌లు తగ్గించిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్‌కు శుభవార్త చెప్పారు. టారిఫ్‌లు 25% నుంచి 18 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇవాళ PM మోదీతో మాట్లాడా. ఆయన నాకు గొప్ప స్నేహితుడు. శక్తిమంతమైన నాయకుడు. రష్యన్ చమురు కొనుగోలును ఆపడానికి, US, వెనిజులా నుంచి కొనుగోలు చేయడానికి ఆయన అంగీకరించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందానికి అంగీకారం కుదిరింది’ అని ట్రూత్‌లో పోస్టు చేశారు.


