News January 1, 2026
ఖమ్మం నగరంలో దారుణం… వృద్ధురాలి హత్య

ఖమ్మం బొక్కలగడ్డలో గురువారం దారుణ ఘటన చోటుచేసుకుంది. మోటే రాములమ్మను మరిది కొడుకు శేఖర్ ఇంటిముందు మిరపకాయల తొడిమలు తీస్తుండగా కత్తితో పొడిచి హత్య చేసినట్లు స్థానికులు తెలిపారు. అడ్డుకోబోయిన మరో వ్యక్తిపై కూడా నిందితుడు కత్తితో దాడి చేయగా, అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు నిందితుడు శేఖర్‌ను అదుపులోకి తీసుకొని హత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.
Similar News
News January 18, 2026
టీడీపీని ఈ గడ్డపైకి తెచ్చే పన్నాగాలను జనం తిప్పికొడతారు: కేటీఆర్

TG: బీఆర్ఎస్ దిమ్మెలను కూల్చివేయాలన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలపై KTR ఫైరయ్యారు. ‘సీఎంగానే కాదు హోంమంత్రిగా ఉన్నావన్న సోయి లేకుండా BRS జెండా గద్దెలను ధ్వంసం చేయాలంటావా? శాంతిభద్రతల్లో పదేళ్లు దేశానికి ఆదర్శంగా నిలిచిన TGలో ఇప్పుడు అరాచకాలు చేసేవారు రాజ్యమేలడం ఓ దరిద్రం. బీఆర్ఎస్‌ను ఎదుర్కోలేక BJPతో చీకటి ఒప్పందాలు, టీడీపీని తిరిగి ఈ గడ్డపైకి తెచ్చే నీ పన్నాగాలను ప్రజలు తిప్పికొడుతారు’ అని మండిపడ్డారు.
News January 18, 2026
పొంగులేటి నివాసంలో సీఎం విందు.. అదిరిందన్న రేవంత్!

మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా మంత్రి ఏర్పాటు చేసిన తెలంగాణ వంటకాలతో కూడిన విందును సీఎం ఆస్వాదించారు. “భోజనం అదిరింది” అంటూ మంత్రి కుటుంబ సభ్యులను అభినందించారు. అనంతరం పొంగులేటి దంపతులు సీఎంను శాలువాతో సత్కరించి, హస్తకళా పెయింటింగ్‌ను జ్ఞాపికగా బహూకరించారు.
News January 18, 2026
హీరో ధనుష్‌తో పెళ్లి.. మృణాల్ టీమ్ రియాక్షన్ ఇదే

వచ్చే నెల 14న తమిళ హీరో ధనుష్‌తో <<18863331>>పెళ్లి<<>> అంటూ జరుగుతున్న ప్రచారానికి హీరోయిన్ మృణాల్ ఠాకూర్ టీమ్ తెరదించింది. ‘మృణాల్ వచ్చే నెలలో పెళ్లి చేసుకోవట్లేదు. ఎలాంటి కారణం లేకుండానే ఈ ప్రచారం జరుగుతోంది’ అని పేర్కొంది. అది పూర్తిగా తప్పుడు ప్రచారమని, ఎవరూ నమ్మొద్దని సూచించింది. కాగా ఇప్పటివరకు మృణాల్ గానీ ధనుష్ గానీ ఈ ప్రచారంపై స్పందించకపోవడం గమనార్హం.


