News January 1, 2026
AMP: పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్న కలెక్టర్, ఎస్పీ

నూతన సంవత్సరం పురస్కరించుకొని అమలాపురంలో కలెక్టర్ మహేశ్ కుమార్‌ను ఎస్పీ రాహుల్ మీనా గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు ఎస్పీ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ కూడా ఎస్పీకి నూతన సంవత్సర అభినందనలు తెలియజేశారు. కొత్త ఏడాదిలో జిల్లా ప్రజలందరికీ అంతా మంచే జరగాలని, అభివృద్ధి పథంలో జిల్లా ముందుకు సాగాలని వారు ఆకాంక్షించారు.
Similar News
News January 2, 2026
నేషనల్స్‌కు నర్సీపట్నం సీనియర్ మహిళా బాక్సర్లు

నర్సీపట్నం బాక్సింగ్ అకాడమీకి చెందిన ఇద్దరు సీనియర్ ఉమెన్ బాక్సర్లు జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. ఈనెల 4 నుంచి 10వ తేదీ వరకు గ్రేటర్ నోయిడాలో జరిగే 9వ సీనియర్ మెన్, ఉమెన్ నేషనల్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో బొంతు మౌనిక(75 కేజీలు), యర్రా తేజస్విని (80+ కేజీలు) పాల్గొంటారు. ఇటీవల పిఠాపురంలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి అర్హత పొందారు.
News January 2, 2026
నువ్వుల పంటలో బిహారీ గొంగళి పురుగు – నివారణ

నువ్వుల పంట తొలిదశలో చిన్న గొంగళి పురుగులు ఆకు పత్రహరితాన్ని గోకి తినడం వల్ల ఆకులు జల్లెడలా మారతాయి. ఎదిగిన గొంగళి పురుగులు మొగ్గలకు, పువ్వులకు, కాయలకు రంధ్రాలు చేసి విత్తనాలను తింటాయి. వీటి నివారణకు ఎకరాకు 16- 20 పక్షి స్థావరాలను, హెక్టారుకు ఒక దీపపు ఎరను అమర్చాలి. తొలుత లీటరు నీటికి వేపనూనె 5mlను, తర్వాతి దశలో లీటరు నీటికి క్లోరిఫైరిపాస్ 2.5ml లేదా ఎసిఫేట్ 1.5 గ్రా. కలిపి పిచికారీ చేయాలి.
News January 2, 2026
అధిక బరువుతో ముప్పు.. ఓసారి చెక్ చేసుకోండి!

ఆరోగ్యంగా ఉండాలంటే ఎత్తుకు తగిన బరువు ఉండటం తప్పనిసరి. దీనిని బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఆధారంగా లెక్కిస్తారు. 5 అడుగుల ఎత్తున్న పురుషులు 50-55kgs, మహిళలు 45-50kgs ఉండాలి. అదే 5.5ft ఎత్తున్న అబ్బాయిలు 60-65, అమ్మాయిలు 55-60 కిలోల బరువుండాలి. 6ft ఎత్తున్న మెన్స్ 75-82, ఉమెన్స్ 69-74 కిలోల మధ్య ఉండటం ఉత్తమం. అధిక బరువు గుండె జబ్బులు, మధుమేహానికి దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. share it


