News January 1, 2026

జాగ్రత్త.. ఉమ్మడి ఖమ్మంలో దట్టమైన పొగమంచు!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రానున్న రోజుల్లో దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. చలి తీవ్రతకు తోడు పొగమంచు వల్ల రహదారులపై ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని, వేగాన్ని తగ్గించి వాహనాలను నడపాలని సూచించారు. ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా యంత్రాంగం ప్రజలను కోరింది.

Similar News

News January 3, 2026

ఇతిహాసాలు క్విజ్ – 116

image

ఈరోజు ప్రశ్న: వాల్మీకీ కన్నా ముందే రామాయణంలో ఒకరు రామాయణాన్ని రాశారు. అది ఎవరు?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News January 3, 2026

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఉద్యోగాలు

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు (<>CUTN<<>>) 13 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 21 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, M.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cutn.ac.in/

News January 3, 2026

పంటల్లో చెదపురుగుల కట్టడికి మరికొన్ని సూచనలు

image

పొలం గట్లపై ఉండే చెదపురుగుల స్థావరాలను గుర్తించి నాశనం చేయాలి. సరిగా కుళ్లని సేంద్రియ ఎరువు చెదపురుగులను ఆకర్షిస్తుంది. అందుకే బాగా కుళ్లిన సేంద్రియ పదార్థాన్నే ఎరువుగా వాడాలి. పంట విత్తేసమయంలో KG విత్తనానికి క్లోరిపైరిఫాస్ 6ml కలిపి విత్తనశుద్ధి చేస్తే విత్తనాలను చెద నుంచి కాపాడవచ్చు. చెరకు పంటలో చెదల నివారణకు లీటరు నీటికి మలాథియాన్ 2mlను కలిపి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత మొక్క మొదల్లో వేయాలి.