News January 1, 2026

భువనగిరి జిల్లా టుడే టాప్ న్యూస్

image

* యాదగిరిగుట్టలో మంత్రి పొన్నం పోస్టర్ ఆవిష్కరణ
* యాదగిరిగుట్ట ఈవో వెంకట్రావు రాజీనామా
* భువనగిరి జిల్లాలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లపై చర్చ
* సీఎంను కలిసిన కలెక్టర్ హనుమంతరావు
* ఎస్పీ అక్షాంశ్ యాదవ్‌ను కలిసిన డీఎస్పీ రాహుల్ రెడ్డి
* ప్రశాంతంగా న్యూ ఇయర్ వేడుకలు
* జిల్లాలో ఆలయాలకు పోటెత్తిన భక్తులు

Similar News

News January 5, 2026

మొయినాబాద్: 8 నెలలుగా మ్యాథ్య్ టీచర్ లేక 10th విద్యార్థుల ఆందోళన

image

మొయినాబాద్‌లోని హిమాయత్‌నగర్ ప్రభుత్వ పాఠశాలలో 8 నెలలుగా గణిత బోధించకపోవడంతో 10వ తరగతి విద్యార్థులు పరీక్షలకు భయపడుతున్నారు. సిలబస్ పూర్తి కాకుండానే 10వ పబ్లిక్ పరీక్షలు జరగబోతున్న నేపథ్యంలో వారి భవిష్యత్తుపై ఆందోళనకు గురవుతున్నారు. ఈ రోజు హిమాయత్‌నగర్ కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుడు బురకాయల రమేశ్ 10వ తరగతి విద్యార్థులను సందర్శించి, MEOతో మాట్లాడి ఉపాధ్యాయుని నియమిస్తానని హామీ ఇచ్చారు.

News January 5, 2026

మీ గుమ్మానికి ‘స్వస్తిక్’ గుర్తు ఉందా?

image

స్వస్తిక్ సానుకూల శక్తి, శుభానికి సంకేతం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగి అదృష్టం వరిస్తుందని జ్యోతిషులు చెబుతున్నారు. స్వస్తిక్ వేసిన చోట పరిశుభ్రత పాటించాలని, అక్కడ బూట్లు, చెప్పులు ఉంచకూడదని అంటున్నారు. ఇది ఎరుపు రంగులో ఉంటే అదృష్టమని, ఇంట్లోకి ప్రతికూల శక్తి రాకుండా నిరోధించవచ్చని సూచిస్తున్నారు. సుఖశాంతులు, ఐశ్వర్యం వెల్లివిరుస్తాయని నమ్మకం.

News January 5, 2026

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌లో 50 పోస్టులు

image

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(BEML)లో 50 పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. అర్హతగల వారు ఎల్లుండి (JAN 7)వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE, B.Tech, డిప్లొమా, CA, ICWA, MBA, ME, ఎంటెక్, MSW, MA, PhD(హిందీ), LLB ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అసెస్‌మెంట్/రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.bemlindia.in/