News January 1, 2026

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత దేవా

image

TG: మావోయిస్టు పార్టీ అగ్రనేత బర్సె దేవా అలియాస్ సుక్కాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన దేవాపై రూ.50 లక్షల రివార్డు ఉందని పోలీసులు చెబుతున్నారు. మరో 15 మంది కూడా పోలీసుల అదుపులో ఉన్నట్టు సమాచారం. వారందరినీ వెంటనే కోర్టులో హాజరుపరచాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తోంది. మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో కలిసి దేవా గతంలో పనిచేశారు.

Similar News

News February 22, 2026

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో లాభాలు

image

కుంకుమపువ్వుతో మహిళలకు ఎన్నో ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. హార్మోన్ల సమతుల్యతను కాపాడటంతో పాటు బీపీ, కొలెస్ట్రాల్‌‌ను అదుపులో ఉంచి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడే క్రోసెటిన్, క్రోసిన్ కుంకుమపువ్వులో ఉంటాయంటున్నారు. రోగనిరోధకశక్తిని పెంచడంలో కూడా ఇది తోడ్పడుతుంది. పాలలో కలుపుకొని తాగటం లేదా కుంకుమ పువ్వు టీ చేసుకొని తాగడం మంచిదని సూచిస్తున్నారు.

News February 22, 2026

కర్ణాటకలో పవర్ షేరింగ్‌పై త్వరలో కీలక ప్రకటన!

image

కర్ణాటకలో CM సిద్దరామయ్య, Dy.CM DK శివకుమార్ మధ్య సాగుతున్న అధికార పోరుకు కాంగ్రెస్ హైకమాండ్ త్వరలో ముగింపు పలకనున్నట్లు ఆ రాష్ట్ర మంత్రి సతీశ్ జార్కీహోళీ తెలిపారు. పవర్ షేరింగ్‌పై హైకమాండ్ ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు AICC అధ్యక్షుడు ఖర్గేను కలిసిన అనంతరం ఆయన వెల్లడించారు. సిద్దరామయ్య రెండున్నరేళ్ల పదవీకాలం ముగియడంతో అధికారాన్ని తనకు అప్పగించాలని శివకుమార్ కోరుతున్న విషయం తెలిసిందే.

News February 22, 2026

చిక్కిపోతున్న చందమామ!

image

చంద్రుడు క్రమంగా కుచించుకుపోతున్నాడని నేషనల్ ఎయిర్&స్పేస్ మ్యూజియానికి చెందిన సెంటర్ ఫర్ ఎర్త్ అండ్ ప్లానెటరీ స్టడీస్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. చంద్రకంపాల వల్ల ఏర్పడే పగుళ్లే ఇందుకు కారణమని చెబుతున్నారు. చందమామపై పగుళ్ల గురించి శాస్త్రవేత్తలకు 2010 నుంచే తెలిసినా తాజాగా లూనార్ మారియా ప్రాంతాల్లో 1,114 కొత్త పగుళ్లను గుర్తించారు. వీటిని స్మాల్ మేర్ రిడ్జెస్ అని పిలుస్తున్నారు.