News April 24, 2024
శ్రామికులకు వడగాలుల ముప్పు
ప్రపంచవ్యాప్తంగా 70% మంది కార్మికులకు వడగాలుల ముప్పు పొంచి ఉందని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ వెల్లడించింది. 2000-2020 మధ్య ఈ ముప్పు 34.7% పెరిగిందని తెలిపింది. ‘వడగాలుల కారణంగా కిడ్నీ సంబంధిత వ్యాధుల బారిన పడిన వారి సంఖ్య 2020 నాటికి 26.2 మిలియన్లుగా ఉంది. ఏటా 1.6 బిలియన్ల వర్కర్లు యూవీ రేడియేషన్కు గురవుతుండగా, 18,960 మంది స్కిన్ క్యాన్సర్ బారిన పడి చనిపోతున్నారు’ అని పేర్కొంది.
Similar News
News November 20, 2024
ఝార్ఖండ్లో ముగిసిన పోలింగ్.. కాసేపట్లో WAY2NEWSలో ఎగ్జిట్ పోల్స్
ఝార్ఖండ్లో రెండో విడత పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల వరకు క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లకు ఓటు వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. మొత్తం 38 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. మధ్యాహ్నం 3 గంటల వరకు 61.47శాతం ఓటింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్, ఈనెల 23న ఫలితాలు వెలువడతాయి. ఎగ్జిట్ పోల్స్ ఎక్స్క్లూజివ్గా WAY2NEWS యాప్లో చూడండి.
News November 20, 2024
సంపన్నుల మహారాష్ట్రను ఓడించిన భూమిపుత్రుల ఝార్ఖండ్
ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం ఓటుహక్కు. దానిని ఉపయోగించుకోవడంలో ఫార్వర్డ్ స్టేట్ మహారాష్ట్ర వెనకబడగా బ్యాక్వర్డ్ స్టేట్ ఝార్ఖండ్ ముందుచూపు కనబరిచింది. అధిక పట్టణ జనాభా, అప్పర్ మిడిల్ క్లాస్, సంపన్నులుండే మరాఠా రాష్ట్రంలో ఓటేసేందుకు ఉత్సాహం చూపించలేదు. గిరిజనులు, గ్రామీణులు అధికంగా ఉండే ఝార్ఖండ్ భూమిపుత్రులు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. 3PMకు JHAలో 61%, MHలో 45% ఓటింగ్ నమోదవ్వడమే ఇందుకు ఉదాహరణ.
News November 20, 2024
5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డుల రద్దు: కేంద్రం
ఆధార్, ఈకేవైసీ వెరిఫికేషన్ల ద్వారా దేశవ్యాప్తంగా 5.8 కోట్ల నకిలీ రేషన్ కార్డులను తొలగించినట్లు కేంద్రం వెల్లడించింది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా 80.6 కోట్ల మందికి లబ్ధి చేకూరుస్తున్నామని తెలిపింది. ఆహార భద్రతలో ప్రపంచానికే బెంచ్మార్క్ నిర్దేశించామంది. ప్రస్తుతం 20.4 కోట్ల రేషన్ కార్డులను డిజిటలైజ్ చేశామని పేర్కొంది. వన్ నేషన్-వన్ రేషన్ కార్డు ద్వారా ఎక్కడైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించామంది.