News January 1, 2026

వాట్సాప్‌లో వచ్చే ఏపీకే ఫైల్స్‌తో జాగ్రత్త: ఎస్పీ

image

వాట్సాప్‌లో వచ్చే గుర్తుతెలియని ఏపీకే (APK) ఫైల్స్, సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ రాహుల్ మీనా గురువారం సూచించారు. అమలాపురం నుంచి ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అవగాహనతో ఉండాలన్నారు. ఎవరైనా మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని కోరారు. వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ షేర్ చేయవద్దని హెచ్చరించారు.

Similar News

News February 3, 2026

తాండూర్: విద్యుత్ షాక్‌తో ప్రభుత్వ టీచర్ మృతి

image

విద్యుత్ షాక్ తగిలి ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన విషాద ఘటన మంగళవారం కోకట్‌లో చోటుచేసుకుంది. రాస్నం పాఠశాలలో విధులు నిర్వహిస్తున్నారు. కోకట్ గ్రామానికి చెందిన మహమ్మద్ ఉదయం ఇంట్లో విద్యుత్ బోర్డులు సరిచేస్తుండగా షాక్‌ తగిలి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు హుటాహుటిన తాండూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

News February 3, 2026

ప్రొద్దుటూరులో పెరిగిన బంగారం, వెండి ధరలు.!

image

ప్రొద్దుటూరులో నిన్నటికన్నా ఈరోజు బంగారు, వెండి ధరలు పెరిగాయి. 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర నిన్న రూ.14,900 ఉండగా.. నేడు రూ.15,850కు చేరుకుంది. అలాగే 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర నిన్న రూ.13,708గా ఉండగా.. నేడు రూ.14,582కు చేరుకుంది. ఇక వెండి 10 గ్రాముల ధర నిన్న రూ.2,500 ఉండగా.. రూ.280 పెరగడంతో రూ.2,780కు చేరుకుంది.

News February 3, 2026

T20 వరల్డ్ కప్.. HYDలో బిగ్ స్క్రీన్‌లు

image

క్రికెట్ వరల్డ్ కప్.. ఈ పేరే ఓ కిక్.. ఈ నెల 7 నుంచి నెలరోజులపాటు క్రికెట్ ప్రియులను పొట్టి వరల్డ్ కప్ అలరించనుంది. నగరవ్యాప్తంగా ఉన్న పలు బార్లు, రెస్టారెంట్లు ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాయి. బిగ్ స్క్రీన్లను ఏర్పాటు చేసి.. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించి నిర్వాహకులు బిజినెస్ పెంచుకునే పనిలోపడ్డారు. చిల్ అవుతూ క్రికెట్ చూస్తుంటే ఆ మజానే వేరప్పా అని కొందరు క్రికెట్ ప్రేమికులు చెబుతున్నారు.