News January 1, 2026
NZB: అనాథశ్రమ పిల్లలకు నోటు పుస్తకాలు పంపిణీ చేసిన సీపీ

నూతన సంవత్సర సందర్భంగా నిజామాబాద్ సీపీ సాయి చైతన్య గురువారం చిన్న పిల్లల అనాధాశ్రమాలను సందర్శించారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించారు. అక్కడి పిల్లలకు పెన్నులు, నోటు పుస్తకాలు, పండ్లు పంపిణీ చేశారు. పిల్లలు విద్యలో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ (అడ్మిన్) బస్వరెడ్డి, టౌన్ –IV SHO సతీష్, టౌన్ –III, ఎస్సై హరిబాబు పాల్గొన్నారు.
Similar News
News January 22, 2026
NZB: విద్యార్థినులతో కలిసి చెస్ ఆడిన కలెక్టర్

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కేజీబీవీ(KGBV) విద్యార్థినులతో కలిసి నేలపై కూర్చొని ఆసక్తిగా చెస్ ఆడారు. అనంతరం ఆమె ఉపాధ్యాయురాలిగా మారి బోర్డుపై తెలుగు, హిందీ, ఆంగ్ల పాఠాలను బోధించి విద్యార్థినులను ఆశ్చర్యపరిచారు. తన వెంట తెచ్చిన చాక్లెట్లు, బిస్కెట్లు పంపిణీ చేసి వారిలో ఉత్సాహం నింపారు. కలెక్టర్ సరళత్వం, విద్యార్థినులతో మమేకమైన తీరు అందరినీ ఆకట్టుకుంది.
News January 22, 2026
విద్యార్థినులను ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

కేజీబీవీ, మోడల్ స్కూళ్లు బాలికల సర్వతోముఖాభివృద్ధికి వికాస కేంద్రాలుగా నిలవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకాంక్షించారు. గురువారం నిజామాబాద్‌లో స్పెషల్ ఆఫీసర్లు, వార్డెన్లకు నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. కేవలం చదువుకే పరిమితం కాకుండా, అన్ని రంగాల్లో విద్యార్థినులను ప్రతిభావంతులుగా తయారు చేయాలని, విద్యార్థినుల మానసిక స్థితిని గమనిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపాలని దిశానిర్దేశం చేశారు.
News January 22, 2026
నాలుగో మేయర్ కోసం NZB నగరం ఎదురు చూపు

నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చరిత్రలో ఇప్పటివరకు ముగ్గురు మేయర్లు పనిచేశారు. ప్రస్తుతం నాలుగో మేయర్ కోసం నగరం ఎదురు చూస్తోంది. మొదటి మేయర్‌గా కాంగ్రెస్ నుంచి ధర్మపురి సంజయ్, రెండో మేయర్‌గా ఆకుల సుజాత (BRS), మూడో మేయర్‌గా దండు నీతూ కిరణ్ (BRS) పని చేయగా నాలుగో మేయర్ ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ నాలుగో వ్యక్తి ఎవరో తెలియాలంటే ఫలితాల వరకు వేచి చూడాల్సిందే.


