News January 1, 2026

వరంగల్: సార్.. రేపు అసెంబ్లీలో మీ క్వశ్చన్ ఉంది..!

image

అసెంబ్లీలో లీకు వీరులున్నారు. ప్రతిపక్ష MLAలు అడిగే ప్రశ్నలను, లిఖిత పూర్వకంగా అసెంబ్లీ నిర్వాహకులకు అందజేసి, అధికారుల నుంచి సమగ్ర సమాచారం తెప్పించడం రివాజు. ఉమ్మడి WGLకు చెందిన ఓ నేత కుమారుడి ఇసుక మాముళ్ల దందా వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు ఓ ప్రతిపక్ష పార్టీ MLA ఇచ్చిన ప్రశ్నను, జిల్లాకు చెందిన నేతకు సమాచారం అందించారు. ఆ ప్రశ్న జీరో అవర్లో రాకుండా చేయడానికి పడరాని పాట్లు పడుతున్నట్లు సమాచారం.

Similar News

News January 2, 2026

చిన్నారితో రేణూ దేశాయ్.. ఫొటోలు వైరల్

image

న్యూ ఇయర్ సందర్భంగా నటి రేణూ దేశాయ్ ఓ బాబును ఆడిస్తూ తీసుకున్న ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. ‘పసివాళ్లు దేవదూతల్లా ఉంటారు. ఈ చిన్నారి బాలుడు తన క్యూట్‌నెస్‌తో నా మనసు దోచుకున్నాడు’ అని క్యాప్షన్ ఇచ్చారు. దీంతో ఆ పిల్లాడు ఎవరని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఈ పోస్టుకు ఆమె కామెంట్స్ ఆఫ్ చేయడం గమనార్హం. కాగా ప్రస్తుతం ఆమె ‘పదహారు రోజుల పండగ’ అనే సినిమాలో నటిస్తున్నారు.

News January 2, 2026

పార్లమెంట్‌లో పురందేశ్వరి మార్కు.. 89 శాతం హాజరుతో ఆదర్శప్రాయం!

image

18వ లోక్‌సభలో ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తనదైన ముద్ర వేశారు. 89శాతం హాజరుతో సభలో చురుగ్గా పాల్గొన్న ఆమె, 16కీలక చర్చల్లో భాగస్వాములయ్యారు. మొత్తం 119ప్రశ్నల ద్వారా కొబ్బరి, పొగాకు రైతుల సమస్యలు, రైల్వేలు, మహిళా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి అంశాలను పార్లమెంట్ దృష్టికి తీసుకెళ్లారు. అటు స్థానిక సమస్యల పరిష్కారం కోసం కృషిచేస్తూనే, ఇటు అంతర్జాతీయ వేదికలపై దేశ గొంతుకగా నిలుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు.

News January 2, 2026

చిత్తూరు: రూ.350 కోట్ల ఆదాయం.. మారని బతుకులు.!

image

పేరుకే CM సొంత జిల్లా. కుప్పం మినహా మరెక్కడ అభివృద్ధే లేదట. పరిశ్రమలు, మౌలిక వసతులు, రవాణా అంతంత మాత్రమే. నేటికీ తాము విద్య, వైద్యం కోసం తమిళనాడు, TPTకి వెళుతున్నట్లు స్థానికులు అంటున్నారు. జిల్లాలో 960 క్వారీలు ఉన్నాయి. ఏటా రూ.200-250 కోట్ల ఆదాయం వస్తుందట. మున్సిపాలిటీ పన్నులు ఇతర మార్గాల నుంచి వచ్చే రూ.80 కోట్లు అదనం. ఈఆదాయం ఎక్కడికి పోతుంది, జిల్లా అభివృద్ధి ఎందుకు జరగలేదో ఆ మురుగన్‌కే తెలియాలి