News January 1, 2026
టెంపో డ్రైవర్ టు శంఖ్ ఎయిర్‌లైన్స్ ఓనర్..

UP కాన్పూర్‌లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో జన్మించిన శ్రవణ్ కుమార్ విశ్వకర్మ నేడు శంఖ్ ఎయిర్‌లైన్స్‌కు ఓనర్ అయ్యారు. టెంపో నడుపుతూ చిన్న వ్యాపారాలు చేసి నష్టపోయిన శ్రవణ్.. 2014లో సిమెంట్ ట్రేడింగ్‌లో సక్సెస్ కావడంతో మైనింగ్, ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌లోకి దిగారు. భారత్‌లో ప్రారంభం కానున్న 4 కొత్త ఎయిర్‌లైన్స్‌లో శంఖ్ ఒకటి. సామాన్యులు విమానాల్లో ప్రయాణించేలా చేయడమే లక్ష్యమని చెబుతున్నారు శ్రవణ్.
Similar News
News January 16, 2026
వేములవాడకు చేరుకున్న రాష్ట్ర మంత్రి సీతక్క

రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వేములవాడకు చేరుకున్నారు. వేములవాడకు చేరుకున్న మంత్రి సీతక్కకు వేములవాడ ఆర్డీవో రాధాబాయి, ఆలయ ఈవో రమాదేవి, వేములవాడ ఏఎస్పీ రిత్విక్ సాయి ఘనంగా స్వాగతం పలికారు. రేపు శుక్రవారం ఉదయం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.
News January 15, 2026
కనుమ రోజున ప్రయాణాలు చేయవద్దా? దీని వెనుక ఉద్దేశం?

కనుమ రోజున ప్రయాణాలు చేయొద్దనే మాట ఎన్నో ఏళ్లుగా వినిపిస్తోంది. ఈ రోజును పశువుల పండుగగా జరుపుతారు. పంటల సాగులో సాయపడిన పశువులను పూజిస్తారు. అయితే పూర్వం ఎడ్ల బండ్లపై ప్రయాణాలు చేసే వారు కాబట్టి ఈ ఒక్కరోజైనా ఎద్దులను కష్టపెట్టొద్దనే ఉద్దేశంతో ప్రయాణాలు వద్దని చెప్పేవారని పండితులు గుర్తుచేస్తున్నారు. కాగా ప్రస్తుత కాలంలో ఈ నియమం వల్ల కుటుంబమంతా కలిసి గడిపేందుకు ఎక్కువ సమయం ఉంటుందంటున్నారు.
News January 15, 2026
సూర్యపై కామెంట్స్.. నటిపై రూ.100 కోట్ల దావా

టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తరచూ మెసేజ్ చేస్తున్నాడన్న నటి <<18721618>>ఖుషీ<<>> ముఖర్జీపై SKY అభిమాని అన్సారీ చర్యలకు దిగారు. నటి వ్యాఖ్యలను ఖండిస్తూ రూ.100 కోట్ల పరువునష్టం దావా దాఖలు చేశారు. నటికి సూర్య కుమార్ మెసేజులు చేశారనడం పూర్తిగా తప్పని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయన్నారు. ఖుషీకి కనీసం ఏడేళ్ల జైలు శిక్ష పడేలా చూడాలని డిమాండ్ చేశారు.


