News January 2, 2026
భూపాలపల్లి: కొత్త సంవత్సరం పూట.. ఇంటికి ఇద్దరు మహాలక్ష్మిలు!

కొత్త సంవత్సరం పూట ఆ ఇంటికి ఇద్దరు మహాలక్ష్మిలు వచ్చారు. ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపారు. BHPL జిల్లా నేరేడుపల్లికి చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు రావడంతో జిల్లాకేంద్రంలోని 100 పడకల ఆస్పత్రికి కుటుంబీకులు తీసుకొచ్చారు. ఈ క్రమంలో గురువారం సాయంత్రం ఇద్దరు కవలల(ఆడపిల్లలు)కు జన్మనిచ్చింది. న్యూ ఇయర్ రోజు కవలలు పుట్టడంతో కుటుంబ సభ్యలు సంతోషంలో మునిగిపోయారు.
Similar News
News January 2, 2026
CM రేవంత్ వ్యూహాత్మక అడుగులు!

TG: అసెంబ్లీలో పాలమూరు ప్రాజెక్ట్ అంశం చర్చకు వస్తే KCR, BRSను నిలదీసేలా అధికారపక్షాన్ని CM రేవంత్ సన్నద్ధం చేశారు. విపక్షాన్ని చర్చకు ఆహ్వానిస్తూనే సభలో తాము ఎలా స్పందిస్తామనే క్లారిటీ ఇచ్చారు. KCRని ఏ అంశాలపై ప్రశ్నించదలిచారో <<18735385>>ప్రెస్‌మీట్<<>> పెట్టి మరీ వెల్లడించారు. సభలో సమాధానం చెప్పాలని సవాల్ చేశారు. దీంతో ఇవన్నీ అసెంబ్లీ సమావేశాలపై రేవంత్ వ్యూహాత్మకంగా వేస్తున్న అడుగులేనా అన్న చర్చ సాగుతోంది.
News January 2, 2026
చైనాలో కండోమ్ ట్యాక్స్.. ‘ధరలు పెంచితే పిల్లలు పుట్టేస్తారా?’

కండోమ్‌లపై చైనా 13 శాతం పన్ను విధించింది. గర్భనిరోధక వస్తువులు, మందులపై ఈ ట్యాక్స్‌ను జనవరి 1 నుంచి అమల్లోకి తెచ్చింది. గతంలో వన్ చైల్డ్ పాలసీ సమయంలో వీటికి మినహాయింపులు ఇచ్చింది. కానీ జననాల రేటు భారీగా పడిపోవడంతో గర్భనిరోధకాలను వాడకుండా పన్ను విధించింది. దీంతో ధరలు పెరిగితే పిల్లలు పుట్టేస్తారా అంటూ చైనా యువత SMలో సెటైర్లు వేస్తోంది. ‘ఏడాదికి సరిపడా ముందే కొనేశా’ అని ఓ యూజర్ పేర్కొన్నారు.
News January 2, 2026
ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌లో శ్రీహ సత్తా

మధురైలో ఏథెన్స్ ఆఫ్ ది ఈస్ట్ డిసెంబర్ 30న ఐదో సారి నిర్వహించిన గ్రాండ్ మాస్టర్ ఇంటర్నేషనల్ బిలో 1800 ఫిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్‌లో ప్రపంచవ్యాప్తంగా 1,245 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో అనంతపురం జిల్లా క్రీడాకారిణి శ్రీహ 9కి 7 పాయింట్లతో ఓపెన్ విభాగంలో 21వ స్థానాన్ని సాధించింది. గురువారం కోచ్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ.. శ్రీహ ప్రపంచ స్థాయి టోర్నమెంట్‌లో రాణించి జిల్లా ఖ్యాతిని పెంచిందన్నారు.


