News January 2, 2026
మరిన్ని ODI సిరీస్‌లు నిర్వహించాలి: ఇర్ఫాన్ పఠాన్

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కోసం 5 మ్యాచ్‌ల ODIలు, ట్రై/క్వాడ్రిలేటరల్ సిరీస్‌లు నిర్వహించాలని భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అభిప్రాయపడ్డారు. 3 మ్యాచ్‌ల సిరీస్‌లే ఎందుకు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. వీరి ఆట చూడాలంటే వన్డేల్లో అలాంటి సిరీస్‌లు అవసరమని చెప్పారు. ప్రస్తుతం రోహిత్, కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నారని గుర్తుచేశారు. కాగా జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో భారత్ 3 వన్డేల సిరీస్ ఆడనుంది.
Similar News
News February 5, 2026
తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పడిపోయాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.5,020 తగ్గి రూ.1,54,420కి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.4,600 పడిపోయి రూ.1,41,550 పలుకుతోంది.
News February 5, 2026
హిందీ మాత్రమే నేర్చుకుంటే పానీపూరీ అమ్ముకోవాల్సిందే: మంత్రి

హిందీ వివాదం వేళ తమిళనాడు మంత్రి MRK పన్నీర్‌సెల్వం షాకింగ్ కామెంట్లు చేశారు. ఉత్తరాది ప్రజలు కేవలం హిందీ నేర్చుకోవడం వల్ల వారు తమిళనాడులో పానీపూరీ సెల్లర్లు, నిర్మాణ కార్మికులు, టేబుల్ క్లీన్ చేసేవారిగా స్థిరపడుతున్నారని ఎద్దేవా చేశారు. తమిళియన్లు మాతృభాషతోపాటు ఇంగ్లిష్ నేర్చుకుని US, UKలో ఉద్యోగాలు సాధించి రూ.కోట్లు సంపాదిస్తున్నారని పేర్కొన్నారు.
News February 5, 2026
శంషాబాద్ కేంద్రంగా 3 బుల్లెట్ రైలు కారిడార్లు: కిషన్ రెడ్డి

HYD హైస్పీడ్ రైల్ హబ్‌గా మారబోతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘TGలో రైల్వే మౌలిక సదుపాయాలకు బడ్జెట్‌లో ₹5,454Cr కేటాయించాం. శంషాబాద్ కేంద్రంగా 3 బుల్లెట్ రైలు కారిడార్లు ప్రారంభం కానున్నాయి. వీటి ద్వారా HYD-BLR, CHE-PUNE జర్నీకి 3hrs కంటే తక్కువ సమయం పట్టనుంది. రాష్ట్రంలో ఇప్పటికే ₹47,984Cr విలువైన ప్రాజెక్టులు కొనసాగుతుండగా, 100% రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తయింది’ అని పేర్కొన్నారు.


