News April 24, 2024
నేను పిలిస్తే 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి: మంత్రి కోమటిరెడ్డి

TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను పిలిస్తే కాంగ్రెస్‌లోకి రావడానికి 25 మంది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో 13-14 MP సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. కేసీఆర్ వల్లే నల్గొండలో కరవు వచ్చిందని దుయ్యబట్టారు. బస్సు యాత్ర చేయడానికి బీఆర్ఎస్ చీఫ్‌కు సిగ్గుండాలని మండిపడ్డారు. మతాల మధ్య చిచ్చు పెట్టి బీజేపీ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు.
Similar News
News April 17, 2026
హార్ముజ్‌ను ఇరాన్ ఇక ఆయుధంగా వాడదు: ట్రంప్

హార్ముజ్ జలసంధిని ఇకపై ఎప్పటికీ తెరిచే ఉంచేందుకు ఇరాన్ అంగీకరించిందని US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇకపై దానిని ఆ దేశం ఆయుధంగా ప్రయోగించదన్నారు. తమ సహకారంతో ఇరాన్ హార్ముజ్‌లోని మైన్స్‌ను తొలగిస్తోందన్నారు. యుద్ధం వేళ సమన్వయం పాటిస్తూ సహకరించిన సౌదీ, యూఏఈ, ఖతర్‌లకు ధన్యవాదాలు తెలిపారు. పాక్ ప్రధాని షరీఫ్, ఆర్మీ చీఫ్ మునీర్ అద్భుతమైన వ్యక్తులని పొగడ్తలతో ముంచెత్తారు.
News April 17, 2026
ఫ్రిజ్‌ను ఆఫ్ చేస్తున్నారా?

ఫ్రిజ్‌ను తరచూ ఆన్ ఆఫ్ చేస్తే కంప్రెసర్‌పై ఒత్తిడి పెరిగి దాని లైఫ్ స్పాన్ తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఒకట్రెండు రోజులు బయటికెళ్తున్నా, రిఫ్రిజరేటర్‌లో పాలు, పెరుగు, పండ్లు, కూరగాయలు ఉన్నా ఆఫ్ చేయొద్దని సూచిస్తున్నారు. వారాలపాటు మీరు ఇంట్లో లేకపోతే ఫ్రిజ్‌ను పూర్తిగా ఖాళీ చేసి ఆఫ్ చేయొచ్చని పేర్కొంటున్నారు. ట్రేలను శుభ్రం చేసి ఆరబెట్టాలని, లేదంటే ఫ్రిజ్ దుర్వాసన వస్తుందంటున్నారు.
News April 17, 2026
BJP రాజకీయంతోనే బిల్లు వీగింది: KTR

TG: డీలిమిటేషన్ అంశాన్ని ముడిపెట్టడంతోనే మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోయిందని కేటీఆర్ విమర్శించారు. BRS సహా అన్ని పార్టీలు మహిళా రిజర్వేషన్లకు సానుకూలంగా ఉన్నా.. BJP రాజకీయంతోనే బిల్లు వీగిందని ఆరోపించారు. ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ సీట్లతోనే రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఎటువంటి సమస్య వచ్చేది కాదన్నారు. ఇప్పటికైనా వెంటనే డీలిమిటేషన్ అంశంతో సంబంధం లేకుండా కొత్త బిల్లు తేవాలని డిమాండ్ చేశారు.


