News January 2, 2026
కొల్లూరు: ‘రూ.11 లక్షల అప్పు చెల్లించాలన్నందుకు దాడి’

ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వాలని అడిగినందుకు దౌర్జన్యం చేసిన కుటుంబంపై కేసు నమోదు చేసినట్లు కొల్లూరు హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు తెలిపారు. గురువారం ఆయన వివరాల మేరకు.. కొల్లూరుకు చెందిన రాజేశ్వరి వద్ద గూడూరు శ్రీనివాసరావు కుటుంబం రూ.17 లక్షలు ఆప్పు తీసుకుంది. వాటిలో రూ.6 లక్షలు చెల్లించారు. మిగిలిన రూ.11 లక్షలు ఇవ్వాలని రాజేశ్వరి వారిని అడగగా దుర్భాషలాడుతూ దౌర్జన్యానికి దిగారు. ఘటనపై కేసు నమోదైంది.
Similar News
News February 19, 2026
సీఎం కప్ రాష్ట్ర అథ్లెటిక్స్ పోటీలకు జేఎన్ఎస్ రెడీ

సీఎం కప్ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు JNS స్టేడియం సర్వం సిద్ధమైంది. ఈ నెల 20 నుంచి 23 వరకు జరిగే ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వందలాది మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. స్టేడియంలో ట్రాక్, ఫీల్డ్ ఈవెంట్ల ఏర్పాట్లు, ప్రేక్షకుల గ్యాలరీలు, తాగునీరు, లైటింగ్ తదితర సదుపాయాలను అధికారులు కల్పించారు.
News February 19, 2026
ఒకేఒక్కడు.. చరిత్ర సృష్టించాడు

T20Iలలో విండీస్ బౌలర్ షమర్ జోసెఫ్ చరిత్ర సృష్టించారు. ఒక మ్యాచ్‌లో 4 వికెట్లు తీసి, 4 క్యాచ్‌లు పట్టిన తొలి క్రికెటర్‌గా(మెన్స్/ఉమెన్స్) రికార్డు నమోదు చేశారు. T20WCలో నాన్ వికెట్ కీపర్‌గా 4 క్యాచ్‌లు పట్టిన ఐదో ప్లేయర్‌గానూ నిలిచారు. గతంలో డారెన్ సామీ(WI)vsIRE, మార్క్రమ్(SA)vsBAN, మ్యాక్స్‌వెల్(AUS)vsNAM, మున్సే(SCOT)vsITA ఈ ఘనత సాధించారు. కాగా ఇవాళ ఇటలీపై 42 రన్స్ తేడాతో విండీస్ గెలిచింది.
News February 19, 2026
చిత్తూరు: పేరుకే ఉచిత ఇసుక.. కానీ?

ఉచిత ఇసుక పాలసీ అమలులో ఉన్నా జిల్లాలో ఎక్కడా ప్రజలకు ఉచితంగా <<19185159>>ఇసుక<<>> అందడం లేదట. ఇసుకను 5 KM పరిధిలో సరఫరా చేయడానికి కొందరు రూ.2-3 వేల వరకు వసూలు చేస్తున్నారు. ట్రక్కుల ద్వారా రూ.20 వేలు చెల్లించాల్సిందే. దూరం పెరిగే కొద్దీ ధర మరింత పెరుగుతుంది. తమిళనాడులో నిబంధనల మేరకు అక్కడ ఇసుక అక్రమ రవాణా అసాధ్యం. దీంతో కొందరు ఇక్కడి నుంచే ఇసుకను చెన్నై, వెల్లూరు ప్రాంతాలకు తరలిస్తూ కాసులు దండుకుంటున్నారు.


