News April 24, 2024
మాపై బలవంతంగా భారత రాజ్యాంగాన్ని రుద్దుతున్నారు: కాంగ్రెస్ నేత

కాంగ్రెస్ సౌత్ గోవా MP అభ్యర్థి కెప్టెన్ విరియాటో ఫెర్నాండెజ్ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘1961లో పోర్చుగీస్ నుంచి స్వతంత్రం రాగానే GOA ప్రజలపై బలవంతంగా భారత రాజ్యాంగాన్ని అమలు చేసి డ్యుయల్ సిటిజన్‌షిప్‌ను చిక్కుల్లో పెట్టారు. ఈ విషయాన్ని రాహుల్‌తో చెప్తే రాజ్యాంగ విరుద్ధమైన డిమాండ్లను పరిగణించమన్నారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చాక గోవాకు ఫ్రీడం వచ్చినందున ఇది మాకు వర్తించదన్నాను’ అని తెలిపారు.
Similar News
News March 20, 2026
TODAY HEADLINES

☛ ఏపీలో 10,060 పోస్టులతో జాబ్ క్యాలెండర్ విడుదల
☛ ఈ ఏడాది భారీగా ఉద్యోగాలు: CM CBN
☛ రైతును రాజును చేయడమే లక్ష్యం: సీఎం రేవంత్
☛ తెలంగాణలో ఘనంగా గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రదానోత్సవం.. హాజరైన సీఎం రేవంత్, చిరంజీవి, కమల్ తదితరులు
☛ కవిత రాజకీయ పార్టీ పేరు ‘తెలంగాణ ప్రజా జాగృతి’
☛ కొత్త శక్తికి, ఆరంభానికి ప్రతీక ఉగాది: మోదీ
☛ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
News March 20, 2026
కేరళంపై కమలం గురి – 1/2

కేరళంలో పాగా వేయాలని ఈసారి ప్రధాన కూటములు LDF, UDFతో పాటు BJP కూడా శ్రమిస్తోంది. పెరుగుతున్న ఓట్ షేర్‌ను సీట్లుగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 10.57%గా ఉన్న BJP షేర్ 2021లో 11.30%కు పెరిగింది. అప్పుడు NDAకి 2.55% తగ్గి 12.41% వచ్చినా వ్యక్తిగతంగా BJPకి ప్లసే అయింది. 2024 LS పోల్స్‌లో NDAకి 19.24% వచ్చింది. ఇందులో ఒక్క బీజేపీకే 16.68% (3.68%+) వచ్చింది. <<-se>>#Elections2026<<>>
News March 20, 2026
కేరళంపై కమలం గురి – 2/2

ఇక తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో విక్టరీతో బీజేపీకి బూస్ట్ దక్కింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాసర్‌గోడ్, పాలక్కడ్, నెమోమ్ సహా 9 స్థానాల్లో BJP రన్నరప్‌గా నిలిచింది. ఈసారి పార్టీ వీటిపై దృష్టి పెడితే కేరళంలో పాగా ఈజీ అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్‌ను తిప్పుకోవాలన్న ప్రయత్నాలు సక్సస్ అయితే కేరళంలో ఈసారి బీజేపీ ఇంపాక్ట్ కనిపిస్తుందని అంటున్నారు. <<-se>>#Elections2026<<>>


