News January 2, 2026

అన్నమయ్య: ఒకే జిల్లా.. రెండు వేర్వేరు ప్రతిపాదనలు..!

image

అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటి మార్పుపై రాజకీయ వేడి కొనసాగుతోంది. జిల్లా కేంద్రం తరలింపును వ్యతిరేకిస్తూ YCP ఆందోళనలకు సిద్ధమవుతుండగా, మరోవైపు జిల్లా పేరును ‘అన్నమయ్య’ కాకుండా ‘మదనపల్లె’గా పెట్టాలంటూ ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా కోడూరును తిరుపతి జిల్లాలో కలపడంతో కోడూరు వాసులు సంబరాలు చేసుకుంటున్నారు. జిల్లా పునర్వ్యవస్థీకరణ అంశం రాజకీయంగా మరింత చర్చనీయాంశంగా మారింది.

Similar News

News January 11, 2026

గేదె పాలకు ఉన్న ప్రత్యేకతలు ఇవే..

image

ఆవు పాలకంటే గేదె పాలలో ఎక్కువ కొవ్వు, ప్రొటీన్లు ఉంటాయి. ఈ పాలు చాలా చిక్కగా ఉండటం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. గేదె పాలలో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉండి ఎముకలను బలోపేతం చేస్తాయి. పెరాక్సిడేస్ అనే ఎంజైమ్ యాక్టివిటీ వల్ల ఆవు పాల కంటే ఇవి ఎక్కువ స‌మ‌యం నిల్వ ఉంటాయి. ‌మంచి శరీర సౌష్టవం, బరువు పెరగాలనుకువేవారికి గేదె పాలు మేలు చేస్తాయంటున్నారు నిపుణులు.

News January 11, 2026

చిత్తూరు: అమ్మానాన్నపై ప్రేమతో..❤

image

చనిపోయిన తల్లిదండ్రుల పేరిట మాలధారణ చేసి ప్రేమను చాటుకున్నారు చిత్తూరుకు చెందిన SRB ప్రసాద్, ఈశ్వరీ దంపతులు. ‘మా అమ్మనాన్నకు 10మంది పిల్లలైనప్పటికీ కూలీ పనులు చేసి పెంచారు. వాళ్లు చనిపోయాక అమ్మనాన్న పడ్డ కష్టం, ప్రేమకు గుర్తుగా ‘అమ్మానాన్న దీవెన మాల’ స్వీకరించాం. మిగిలిన వాళ్లు ఇలా చేయాలని ఆశిస్తున్నాం’ అని ప్రసాద్ చెప్పారు. సంక్రాంతి రోజు తల్లిదండ్రుల ఫొటో వద్ద పూజలు చేసి మాల విరమించనున్నారు.

News January 11, 2026

సంక్రాంతి కోడి పందేలను అడ్డుకోవాలి: హైకోర్టు

image

AP: సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడి పందేలను, పేకాటను అడ్డుకోవాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే 144 సెక్షన్ అమలు చేయాలని తెలిపింది. జంతు హింస నిరోధక చట్టం-1960, జూద నిరోధక చట్టం-1974 అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. కోడి పందేలు, బెట్టింగ్‌లపై కోర్టులో పలువురు పిటిషన్లు దాఖలు చేయడంతో ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అన్ని మండలాల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేయాలంది.