News January 2, 2026

70 ఏళ్ల వయసులో 700KM సైకిల్ యాత్ర.. మోదీ ప్రశంసలు!

image

70 ఏళ్ల వయసులో 700KMకు పైగా సైకిల్ యాత్ర నిర్వహించిన BJP MLA సురేశ్ కుమార్‌ను PM మోదీ ప్రశంసించారు. బెంగళూరు నుంచి కన్యాకుమారి వరకు 5 రోజులు ఆయన సైకిల్‌పై వెళ్లారు. ‘సురేశ్ యాత్ర స్ఫూర్తిదాయకం. అనారోగ్య సమస్యను అధిగమించి ఈ ఘనత సాధించడం ఆయన ధైర్యాన్ని, పట్టుదలను తెలియజేస్తోంది. ఫిట్‌నెస్‌పై ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది’ అని ట్వీట్ చేశారు. ఆయనకు ఫోన్ చేసి అభినందించినట్లు తెలిపారు.

Similar News

News January 12, 2026

బంగ్లాదేశ్ WC మ్యాచులు భారత్‌లోనే!

image

టీ20 వరల్డ్ కప్‌లో తమ మ్యాచులను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే దీనిపై ICC ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాటిని శ్రీలంకకు మార్చకపోవచ్చు. షెడ్యూల్ ప్రకారం బంగ్లా టీమ్ కోల్‌కతా, ముంబైలో 4 మ్యాచులు ఆడాల్సి ఉంది. వాటిని విదేశాల్లో నిర్వహించకపోవచ్చని సమాచారం. అక్కడ జరగాల్సిన మ్యాచులను చెన్నై, తిరువునంతపురంలో నిర్వహిస్తారని తెలుస్తోంది.

News January 12, 2026

నల్లమల సాగర్‌తో ఎవరికీ నష్టం లేదు: చంద్రబాబు

image

AP: నల్లమలసాగర్ ద్వారా రాయలసీమ, ప్రకాశం తదితర ప్రాంతాలకు నీరిచ్చే అవకాశం ఉందని మంత్రులు, అధికారుల మీటింగ్‌లో CM CBN తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఎవరికీ నష్టం లేదన్నారు. ఎగువ నుంచి వదిలిన నీళ్లు పోలవరం ద్వారా నల్లమల సాగర్‌కు తీసుకెళ్లి వాడుకుంటే తప్పేంటని ప్రశ్నించారు. దీనివల్ల సాగర్, శ్రీశైలంలో మిగులుజలాలను AP, TG వాడుకోవచ్చని వ్యాఖ్యానించారు. అందరం కలిసి పనిచేసుకుందామని TGకి కూడా చెప్పానన్నారు.

News January 12, 2026

అనిల్ రావిపూడి రికార్డ్.. రాజమౌళి తర్వాత

image

డైరెక్టర్ అనిల్ రావిపూడి-చిరంజీవి కాంబోలో వచ్చిన ‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రం <<18832382>>పాజిటివ్<<>> టాక్ సొంతం చేసుకుంది. దీంతో ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్‌లో రాజమౌళి తర్వాత మోస్ట్ సక్సెస్‌ఫుల్ దర్శకుడిగా నిలిచారు. ‘పటాస్(2015)’ నుంచి ఇవాళ రిలీజైన ‘MSVPG’ వరకు మొత్తం 9 సినిమాల్లోనూ హిట్ కొట్టిన దర్శకుడిగా పేరొందారు. నాగార్జునతోనూ మూవీ చేస్తే నలుగురు సీనియర్ హీరోలతో పని చేసిన యువ దర్శకుడిగా మరో ఘనత సాధిస్తారు.