News January 2, 2026
5 బిల్లులు.. MGNREGAపై స్వల్పకాలిక చర్చ

TG: అసెంబ్లీలో ఇవాళ చేపట్టే బిజినెస్ కార్యక్రమాలను కార్యదర్శి తిరుపతి ప్రకటించారు. ముందుగా ప్రశ్నోత్తరాలు ఉంటాయి. ఆపై BAC రిపోర్ట్‌ను CM రేవంత్ ప్రవేశపెడతారు. మంత్రి ప్రభాకర్ రవాణా, BC వెల్ఫేర్ గెజిట్ నోటిఫికేషన్ పత్రాలు సభకు సమర్పిస్తారు. మున్సిపల్, GHMC ACT సవరణ, ప్రైవేటు వర్సిటీలు, మోటార్ వెహికల్ టాక్సేషన్ చట్ట సవరణ బిల్లులు ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. MGNREGAపై స్వల్పకాలిక చర్చ ఉంటుంది.
Similar News
News January 13, 2026
BHELలో అప్రెంటిస్ పోస్టులు.. అప్లై చేశారా?

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్(BHEL) హరిద్వార్‌లో 50 అప్రెంటిస్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీటెక్, BE, డిప్లొమా అర్హతగల వారు అర్హులు. అభ్యర్థులు ముందుగా NATS పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వయసు 18 -27ఏళ్ల మధ్య ఉండాలి. విద్యార్హతల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్లకు నెలకు రూ.12,900, టెక్నీషియన్ అప్రెంటిస్‌కు రూ.10,900చెల్లిస్తారు. వెబ్‌సైట్: hwr.bhel.com
News January 13, 2026
అదనపు ఛార్జీలు వసూలు చేస్తే బస్సులు సీజ్: మండిపల్లి

AP: సంక్రాంతి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. మరోవైపు అదనపు ఛార్జీలు వసూలు చేసే ట్రావెల్స్ బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అన్ని జిల్లాల్లో తనిఖీలు కొనసాగుతాయని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కొనసాగుతుందని వివరించారు. సొంత, ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించేవారు క్షేమంగా సొంతూళ్లకు చేరుకోవాలని కోరారు.
News January 13, 2026
పండుగ రోజే షట్‌తిల ఏకాదశి.. ఇలా చేస్తే ఎంతో పుణ్యం

పుష్యమాస కృష్ణ పక్షంలో వచ్చే షట్‌తిల ఏకాదశి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది. 2026లో ఇది సంక్రాంతి రోజున వచ్చింది. ‘షట్’ అంటే ఆరు. ‘తిల’ అంటే నువ్వులు. ఈ రోజున నువ్వులతో స్నానం, నలుగు, హోమం, తర్పణం, దానం, నువ్వులు కలిపిన ఆహారం తీసుకోవడం వల్ల విశేష ఫలితాలుంటాయి. భక్తితో ఉపవాసం ఉండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల పితృదోషాలు తొలగి, సంతోషాలు, మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.


