News April 24, 2024
ప.గో.: తోట సీతారామలక్ష్మికి అభినందనలు

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తోట సీతారామలక్ష్మి నాయకత్వంలో కూటమి విజయం సాధిస్తుందని తెలుగు మహిళా జిల్లాధ్యక్షురాలు శిరిగినీడి రాజ్యలక్ష్మి అన్నారు. టీడీపీ పొలిట్ బ్యూరో రాష్ట్ర సభ్యురాలుగా నియమితులైన ఆమెను భీమవరం పార్టీ కార్యాలయంలో కలిసి అభినందనలు తెలిపారు. నరసాపురం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు మంతెన రామరాజు, ఉండి అభ్యర్థి రఘురామకృష్ణంరాజు ఉన్నారు.
Similar News
News March 1, 2026
భీమవరం: కలెక్టర్ ఇచ్చిన ఫ్రీజర్లు.. 2 రోజులకే ధ్వంసం

గత నెలలో భీమవరం ఆస్పత్రిలో ఫ్రీజర్ మరమ్మతులకు గురై ఓ మృతదేహాన్ని రాత్రంతా అలాగే ఉంచిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై కలెక్టర్ స్పందించి రూ.2,60,000 నిధులతో 2 కొత్త ఫ్రీజర్లను ఆస్పత్రికి అందించారు. అయితే 2 రోజులకే దుండగులు వాటిలోని కాపర్ వైర్లను కట్ చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. అయితే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఇలా జరిగిందనే ఆరోపణలున్నాయి.
News March 1, 2026
నరసాపురం: పెద్ద మనిషిలా వచ్చి.. బాలికపై లైంగిక వేధింపులు

నరసాపురం పట్టణానికి చెందిన మైనర్ బాలిక కుటుంబ వివాదాలను చక్కదిద్దుతామని పెద్ద మనిషిలా వచ్చి, బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలికి రావాల్సిన నగదు విషయంలో నిందితుడు కాకిలేటి ఆనంద్ కుమార్ ఆమెను వేధిస్తూ, అసభ్యంగా ప్రవర్తించేవాడు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ ముత్యాలరావు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
News March 1, 2026
తాగునీటి సరఫరాకి ఇబ్బందులు లేకుండా చూడండి: జేసీ

రానున్న వేసవిని దృష్టిలో ఉంచుకొని పట్టణ ప్రజలకు త్రాగునీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని జేసీ టి.రాహుల్ కుమార్ రెడ్డి మున్సిపల్ అధికారులను ఆదేశించారు. భీమవరం కార్యాలయంలో నుంచి గూగుల్ మీట్ ద్వారా శనివారం సమీక్షించారు. పట్టణాల్లో తాగునీటి సరఫరా నిరంతరాయంగా ఉండేలా నీటి నిల్వలు, పంపింగ్ స్టేషన్లు, పైప్‌లైన్ మరమ్మతులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.


