News January 2, 2026

రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్ ఖవాజా

image

ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా ఇంటర్నేషనల్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. సిడ్నీలో ఈ నెల 4 నుంచి ENGతో జరిగే ఐదో యాషెస్ టెస్ట్ తర్వాత రిటైర్ కానున్నట్లు ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. ఈ 39 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ AUS తరఫున 87 టెస్టుల్లో 6,206 రన్స్, 40 వన్డేల్లో 1,154, 9 టీ20ల్లో 241 పరుగులు చేశారు. పాక్‌లో జన్మించిన ఖవాజా ఆస్ట్రేలియా తరఫున ఆడిన తొలి ముస్లిం క్రికెటర్‌గా నిలిచారు.

Similar News

News February 17, 2026

ఈనెల 25న టీచర్ల సీనియారిటీ లిస్టులు

image

AP: టీచర్ల సీనియారిటీ జాబితాలు ఈ నెల 25న విడుదల కానున్నాయి. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన లిస్టులు సిద్ధం చేయాలని అధికారులను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశించారు. 25న విడుదలయ్యే తొలి విడత జాబితాలపై అభ్యంతరాలను స్వీకరించి మార్చి 3న రెండో విడత, 15న మూడో విడత రిలీజ్ చేస్తారు. తుది జాబితాలను మార్చి 30న ప్రకటించి సీనియారిటీ ఖరారు చేస్తారు. వాటి ఆధారంగానే వేసవి సెలవుల్లో బదిలీలు జరుగుతాయి.

News February 17, 2026

‘రియల్’ దూకుడు.. తగ్గేదేలే!

image

దేశంలో రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి రూ.88 లక్షల కోట్లకు చేరనుందని KPMG-నరెడ్కో కన్సల్టెన్సీ సంస్థలు తెలిపాయి. గతేడాదితో పోలిస్తే ఇది మూడు రెట్లు ఎక్కువ. అప్పుడప్పుడు ఆటుపోట్లు ఎదురైనా 2047 నాటికి మరింత పెరిగి రూ.616.7 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని ‘ది రోల్ ఆఫ్ ది రియల్ ఎస్టేట్ ఇన్ వికసిత్ భారత్-2047’ నివేదికలో వెల్లడించాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రియల్ రంగం వెన్నెముకగా మారనుందన్నాయి.

News February 17, 2026

దానిమ్మ పంట నాణ్యత, ఆదాయం పెంచే ‘క్రాప్ కవర్’

image

కొన్నిచోట్ల దానిమ్మ చెట్లపై తెల్లని కవర్ గమనించే ఉంటారు. వీటినే క్రాప్ కవర్స్ అంటారు. వీటిని ప్లాస్టిక్+నైలాన్‌తో తయారు చేస్తారు. ఈ కవర్ వల్ల పండు ఈగ, ఇతర చీడపీడల నుంచి పంటకు రక్షణ లభిస్తుంది. అలాగే మొక్క, కాయలపై అధిక ఎండ, చలి తీవ్రత పడకుండా ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. నేలలో తేమను నిలకడగా ఉంచి కలుపు బెడదను తగ్గిస్తుంది. ఫలితంగా తెగుళ్లు, మచ్చలు లేని నాణ్యమైన పంటతో పాటు అధిక ఆదాయం పొందవచ్చు.