News January 2, 2026

ఇంద్రవెల్లి: వృద్ధురాలి వద్ద బంగారం చోరీ

image

ఇంద్రవెల్లి మార్కెట్‌లో ఓ వృద్ధురాలి వద్ద బంగారు చెవిపోగులు చోరీకి గురైనట్లు ఎస్ఐ సాయన్న తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగను గుర్తించి అతడి ఫొటోను రిలీజ్ చేశామన్నారు. పైన ఉన్న వ్యక్తి కనిపిస్తే వెంటనే 8712659941 ఈ నంబర్‌కు సమాచారం అందించి సహకరించాలని కోరారు.

Similar News

News January 11, 2026

సిద్దిపేట: ‘ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలి’

image

రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి స్వరూపరాణి సూచించారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాంపల్లిలో నిర్వహిస్తున్న ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని ఆమె పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రీ చేసుకోవాలని లేకపోతే PM కిసాన్ వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలకు అవరోధం ఏర్పడుతుందన్నారు.

News January 11, 2026

వర్ధన్నపేట: NH-563పై మృత్యుశకటాలు

image

వర్ధన్నపేట శివారులోని కెనాల్ నుంచి మట్టి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. స్థానిక అవసరాల పేరుతో పర్మిషన్లు తెచ్చుకుని పదుల సంఖ్యలో లారీలతో వరంగల్‌కు మట్టిని తరలిస్తూ అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. NH-563పై లారీలు అతివేగంతో దూసుకెళ్తూ వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అధికార పార్టీ నేత అండదండలతోనే దందా సాగుతోందని, అందుకే అధికారులు పట్టించకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

News January 11, 2026

గండికోట ఉత్సవాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు

image

గండికోట ఉత్సవాల్లో సందర్శకులకు ఆహ్లాదంతోపాటు వినోదంతో కూడిన సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఉంటుందని జిల్లా కలెక్టర్ డా.శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గండికోట ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్ల పరిశీలన భాగంగా జిల్లా కలెక్టర్ మీడియాతో శనివారం మాట్లాడారు. గండికోట ఉత్సవాల్లో సందర్శకులకు మరింత వినోదాన్ని, ఆహ్లాదాన్ని అందించే విధంగా ప్రతిరోజు ఉదయం 10గంటల నుంచి రాత్రి 10 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.