News April 24, 2024
ఖమ్మం: గుండెపోటుతో అడ్వకేట్ మృతి

పెనుబల్లి మండలం వియం బంజర గ్రామానికి చెందిన అడ్వకేట్ పీవీ భాస్కర్ గుండెపోటుతో మృతి చెందారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సప్తపది వారు మృతుడి నేత్రాలను సేకరించి నేత్రదాన నిధికి పంపించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జిల్లా ఛైర్మన్ అబ్దుల్ సలాం, కార్యదర్శి సుంకర సత్యనారాయణ, అధ్యక్షుడు కోట్లు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
Similar News
News March 5, 2026
జిమ్‌లో వ్యాయామం చేస్తూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

ఖమ్మం జిల్లాకు చెందిన నాగండ్ల అనిల్ చౌదరి (36) హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్ నం.36లోని ఎస్బో జిమ్‌లో ఈ నెల 3 మధ్యాహ్నం వ్యాయామం పూర్తి చేసుకున్న అనిల్ చౌదరి వాష్ రూమ్‌కు వెళ్లిన సమయంలో అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
News March 5, 2026
ఖమ్మం:కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు

ఖమ్మం జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం మారి రెండేళ్లు గడుస్తున్నా, సుమారు 17 వేల మంది అర్హులు ఆశగా వేచి చూస్తున్నారు. గత మూడేళ్లుగా కొత్త దరఖాస్తులపై స్పందన లేకపోవడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనైనా తమకు ‘చేయూత’ లభిస్తుందని బాధితులు ఆశీస్తున్నారు
News March 5, 2026
ఖమ్మం: సర్కారు దవాఖానలో ‘దాహ’ మంటలు..

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాగునీటి ఎద్దడి రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చే వందలాది మంది రోగులు, వారి సహాయకులకు కనీసం మంచినీరు కూడా అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండలు ముదురుతుండటంతో బయట నీళ్ల బాటిళ్లు కొనలేక పేదలు అవస్థలు పడుతున్నారు. గతంలో దాతలు ఏర్పాటు చేసిన ఆర్‌ఓ (RO) ప్లాంట్ ప్రస్తుతం నిరుపయోగంగా మారడంతో ఈ దుస్థితి నెలకొంది.


