News January 2, 2026

HYD: AI కోర్సులకు ఫ్రీగా ఆన్‌లైన్ శిక్షణ

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), ML, డేటా సైన్స్ తదితర సాఫ్ట్‌వేర్ కోర్సులకు ఆన్‌లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు నేషనల్ స్కిల్ అకాడమీ డైరెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించి కేంద్ర ప్రభుత్వ ఆమోదిత సర్టిఫికెట్‌ ప్రదానం చేస్తామని తెలిపారు. అసక్తిగల అభ్యర్థులు జనవరి 15లోగా nationalskillacademy.inలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

Similar News

News January 26, 2026

HYD: బులెట్ దిగినా.. హెడ్ కానిస్టేబుల్ తగ్గేదేలే!

image

గచ్చిబౌలిలో ప్రిజం పబ్ వద్ద నిందితుడు ప్రభాకర్‌ను పట్టుకునేందుకు హెడ్ కానిస్టేబుల్ మర్రి వెంకటరెడ్డి సాహసం చేశారు. నిందితుడి కాల్పుల్లో కాలికి గాయమైనప్పటికీ, తగ్గకుండా ప్రాణాలకు తెగించి అతడిని బంధించారు. ఈ అసాధారణ ధైర్యసాహసానికి వెంకటరెడ్డికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంటరీ అవార్డును ప్రకటించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆయన ఈ గౌరవాన్ని అందుకోనున్నారు.

News January 26, 2026

HYD: బండ్లపై ఈ స్టిక్కర్లు వేసుకోవద్దు!

image

వాహనాలపై అనధికారికంగా ప్రెస్, అడ్వకేట్, ప్రభుత్వ చిహ్నాలు, HRC స్టిక్కర్లు వాడటంపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. సమాచార పౌర సంబంధాల శాఖ గుర్తింపు పొందిన అక్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులు మాత్రమే ‘PRESS’అని రాసుకోవాలని, అదీ నంబర్ ప్లేట్లపై ఉండకూడదని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠినచర్యలు తీసుకోవాలని రవాణాశాఖ అధికారులను ఆదేశించింది.

News January 26, 2026

HYD: భూములు వదులుకునేవారికి ‘భారీ నజరానా’..!

image

నగరంలోని చెరువులు, నాలాల పరిరక్షణకు ప్రభుత్వం సరికొత్త TDR పాలసీని తీసుకొచ్చింది. ఇకపై నాలా వెడల్పు కోసం ప్రైవేటు భూములిస్తే రోడ్డు విస్తరణతో సమానంగా 400% TDR ఇస్తారు. అలాగే చెరువుల బఫర్ జోన్లలో స్థలాలు వదులుకునేవారికి 300% TDR లభిస్తుంది. ఒకవేళ ఆ స్థలం చెరువు అభివృద్ధి పనులకు అవసరమైతే ఏకంగా 400% వరకు బెనిఫిట్స్ కల్పిస్తారు. సెట్‌బ్యాక్ నిబంధనల్లో కూడా సడలింపులిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.