News April 24, 2024
బాబును నమ్మి ఎన్నారైలు బలి కావొద్దు: జోగి

AP: టీడీపీ చీఫ్ చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నారైలు డబ్బు తరలిస్తే మనీలాండరింగ్ కేసులో ఇరుక్కుంటారని మంత్రి జోగి రమేశ్ అన్నారు. ‘ఎన్నారైలు బాబును నమ్మితే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదినట్లే. వారు ప్రజా సేవ చేస్తే అభ్యంతరం లేదు. కానీ బాబును నమ్మి కేసుల్లో ఇరుక్కోవద్దు. ఎవరు మంచి చేస్తున్నారో ఎన్నారైలు ఆలోచించుకోవాలి. సుపరిపాలన అందిస్తున్న జగన్‌కు మద్దతు తెలపాలి’ అని ఆయన పిలుపునిచ్చారు.
Similar News
News January 29, 2026
యాసంగి ఆముదం పంటలో పురుగుల కట్టడికి సూచనలు

యాసంగిలో సాగు చేసిన ఆముదం పంటలో వివిధ పురుగుల తీవ్రత పెరిగింది. రసం పీల్చే పురుగుల ఉద్ధృతి ఎక్కువగా ఉంటే వీటి నివారణకు ప్రొఫెనోఫాస్ 2ML లేదా ఎసిటామిప్రిడ్ 0.2గ్రా లేదా ఎసిఫేట్ 1.5గ్రా లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పంటను లద్దె పురుగు ఆశిస్తే లీటరు నీటికి నొవాల్యురాన్ 1ML కలిపి పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు నివారణకు లీటరు నీటికి ప్రొఫెనోఫాస్ 2ML కలిపి పిచికారీ చేయాలి.
News January 29, 2026
పేపర్ ప్లేట్‌గా బ్యాంకు డాక్యుమెంట్.. ప్రైవసీ అంటే ఇదేనా?

కస్టమర్ పర్సనల్ డీటెయిల్స్ ఉన్న బ్యాంకు డాక్యుమెంట్ రోడ్డు పక్కన పేపర్ ప్లేట్‌గా మారడం ఇప్పుడు వైరలవుతోంది. పేరు, లొకేషన్, పేమెంట్ డీటెయిల్స్ వంటి సెన్సిటివ్ డేటా బహిరంగంగా కనిపించడంతో నెటిజన్లు షాకవుతున్నారు. కస్టమర్ డేటాను బ్యాంకులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా వదిలేస్తాయని ప్రశ్నిస్తున్నారు. Moronhumor పేరిట ఉన్న X అకౌంట్‌లో ఈ ఫొటో చూశాక డేటా ప్రైవసీపై SMలో పెద్ద చర్చే నడుస్తోంది.
News January 29, 2026
RBIలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(<


