News January 2, 2026

పల్నాడు: రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి.. అప్డేట్

image

మార్కాపురానికి చెందిన షేక్ కరీముల్లా (50), మాచర్లకు చెందిన నూర్జహాన్(45) బంధువులు. ఇద్దరూ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తుంటారు. మాచర్ల నుంచి మార్కాపురానికి బైకుపై గురువారం బయల్దేరారు. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడుకు చెందిన మహేశ్ బైకుపై మాచర్లకు పయనమయ్యాడు. శిరిగిరిపాడు వద్ద ఈ రెండు బైకులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. కరీముల్లా, నూర్జహాన్ <<18735450>>చనిపోగా<<>> మహేశ్ తీవ్రంగా గాయపడ్డాడు.

Similar News

News January 16, 2026

ఉమ్మడి జిల్లా నీటి సమస్యలు పరిష్కరించాలి: ఎంపీ నగేశ్

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న నీటి సమస్యలను పరిష్కరించాలని ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరారు. శుక్రవారం నిర్మల్ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాలేశ్వరం 26 27 ప్యాకేజీ అసంపూర్తిగా ఉందని, దానిని త్వరగా పూర్తి చేయాలన్నారు. ముప్పు గ్రామాల సమస్యలు పరిష్కరించాలన్నారు.

News January 16, 2026

గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడి గెలుపు

image

ప్రముఖ జర్నలిస్టు గౌరీ లంకేశ్ మర్డర్ కేసు నిందితుడు శ్రీకాంత్ పంగర్కర్ MH ‘జల్నా’ కార్పొరేషన్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2,621 ఓట్ల మెజారిటీతో గెలిచారు. BJP సహా ఇతర పార్టీల అభ్యర్థులను ఓడించారు. ఏక్‌నాథ్ షిండే శివసేన ఇక్కడ అభ్యర్థిని నిలబెట్టలేదు. 2018లో అరెస్టై, 2024 సెప్టెంబర్‌లో కర్ణాటక హైకోర్టు నుంచి పంగర్కర్ బెయిల్ పొందారు. గతంలో అవిభక్త శివసేనలో కార్పొరేటర్‌గా పనిచేశారు.

News January 16, 2026

గద్వాల్: మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో దరఖాస్తులకు ఆహ్వానం

image

మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో 2026- 2027 విద్యా సంవత్సరంలో అర్హులైన విద్యార్థుల ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ గురుకులాల్లో విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన గోడపత్రికలను సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ విడుదల చేశారు.