News April 24, 2024

ఈయన జీతం రోజుకు రూ.50 లక్షలు

image

ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగులకు వార్షిక వేతనాలు భారీగానే ఉంటాయి. కొందరు రోజుకు రూ.వేలల్లో సంపాదిస్తే ఇంకొందరు రోజుకు రూ.లక్షల్లో ఆర్జిస్తారు. అయితే కాగ్నిజెంట్ సీఈవో రవికుమార్ సింగిశెట్టి గత ఆర్థిక సంవత్సరం అత్యధిక వేతనం పొందిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరిగా నిలిచారు. ఆయన రోజుకు రూ.50 లక్షల వేతనం అందుకున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం ఆయన వార్షిక వేతనం సుమారు రూ.186 కోట్లు.

Similar News

News January 29, 2026

BNGR: మున్సిపల్ బరిలో తొలిరోజే 41 నామినేషన్లు

image

యాదాద్రి జిల్లాలోని 6 పురపాలక సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది. 104 వార్డులకు గాను తొలిరోజే 41 నామినేషన్లు దాఖలయ్యాయి. అత్యధికంగా యాదగిరిగుట్టలో 15, ఆలేరులో 10 దరఖాస్తులు అందాయి. చౌటుప్పల్‌లో 6, భువనగిరిలో 5, మోత్కూరులో 3, పోచంపల్లిలో 2 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. రానున్న రెండు రోజుల్లో నామినేషన్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది.

News January 29, 2026

సంగారెడ్డి: నేటి నుంచి 10 విద్యార్థులకు ప్రత్యేక పరీక్షలు

image

సంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఈనెల 29 నుంచి ఫిబ్రవరి 6వ తేదీ వరకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. 29న తెలుగు, 30న హిందీ, 31-ఇంగ్లిష్, ఫిబ్రవరి 2- గణితం, 3- ఫిజికల్ సైన్స్, 5- సోషల్, 6- బయాలజీ పరీక్షల జరుగుతాయని చెప్పారు. పరీక్షలు 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతాయన్నారు.

News January 29, 2026

TODAY HEADLINES

image

* విమాన ప్రమాదంలో MH డిప్యూటీ CM అజిత్ పవార్ దుర్మరణం
* APలో 11వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు
* AP గ్రూప్‌-2 ఫలితాలు విడుదల
* 2.0లో కార్యకర్తలకు టాప్‌ ప్రయారిటీ: జగన్
* TG: మున్సి’పోల్స్’.. నేటి నుంచి మొదలైన నామినేషన్లు
* రికార్డు స్థాయిలో పెరిగిన బంగారం ధర
* 4వ T20లో NZ చేతిలో 50 పరుగుల తేడాతో భారత్ ఓటమి