News January 2, 2026

215 పోస్టులు.. దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్(ITI) 215 యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టును బట్టి BE/B.Tech, MSc(ఎలక్ట్రానిక్స్/CS/IT), డిప్లొమా, ITI, MBA, MCA, BSc(IT), BCA, BBA, BBM, BMS ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల వారు జనవరి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగాల కోసం జాబ్స్ కేటగిరీకి వెళ్లండి.

Similar News

News January 4, 2026

మదురోను బంధించిన డెల్టా ఫోర్స్.. అసలు ఎవరీ కిల్లర్ టీమ్?

image

US సైన్యంలో అత్యంత రహస్యమైన, పవర్‌ఫుల్ విభాగం డెల్టా ఫోర్స్. 1977లో బ్రిటీష్ SAS స్ఫూర్తితో దీన్ని స్థాపించారు. ఇందులో చేరడం చాలా కష్టం. వీరు యూనిఫామ్ ధరించకుండా సాధారణ పౌరుల్లా ఉంటూ రహస్య ఆపరేషన్లు చేస్తారు. సద్దాం హుస్సేన్ పట్టివేత, అల్ బగ్దాదీ హతం తాజాగా మదురో అరెస్ట్ వంటి మిషన్లు వీరే చేశారు. అత్యాధునిక ఆయుధాలు, నైట్ విజన్ టెక్నాలజీతో శత్రువులకు చిక్కకుండా మెరుపు దాడి చేయడం వీరి స్పెషాలిటీ.

News January 4, 2026

అపార ఖనిజాలు.. అస్తవ్యస్త పాలన.. అంధకారం

image

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అనే సామెత వెనిజులాకు సరిపోతుంది. ప్రపంచంలో అత్యధిక చమురు నిల్వలున్నది అక్కడే (18%-$17 ట్రిలియన్స్). ఐరన్, బాక్సైట్, కాపర్, జింక్, బంగారం, రేర్ ఎర్త్ ఎలిమెంట్స్, బ్యాటరీ, ఎలక్ట్రిక్ కంపోనెంట్స్‌లో వాడే నికెల్ నిక్షేపాలూ అపారం. కానీ సొంత&విదేశీ శక్తులతో ప్రభుత్వంలో అస్థిరత వల్ల వాటిని తవ్వి, రిఫైన్ చేసే టెక్నాలజీ, రవాణా ఇబ్బందులతో వెనిజులా భయంకర ఆర్థిక మాంద్యంలో ఉంది.

News January 4, 2026

NIAలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(NIA) 5 సీనియర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు జనవరి 13వరకు అప్లై చేసుకోవచ్చు. LLB అర్హతతో పాటు క్రిమినల్ కేసులు వాదించడంలో కనీసం 8 ఏళ్లపాటు పని అనుభవం ఉండాలి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.1,25,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nia.gov.in